Smart Substations : ఏపీలో స్మార్ట్ సబ్ స్టేషన్లు.. ఉద్యోగులు లేకుండానే విద్యుత్‌ సరఫరా

ఏపీలో కొత్త ఓరవడికి ఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖ స్మార్ట్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులు అవసరం లేకుండా సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు.

Smart Substations : ఏపీలో స్మార్ట్ సబ్ స్టేషన్లు.. ఉద్యోగులు లేకుండానే విద్యుత్‌ సరఫరా

Smart Substations (4)

Smart substations in AP : ఏపీలోని విద్యుత్ వ్యవస్థలో కొత్త ఓరవడికి ఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖ స్మార్ట్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులు అవసరం లేకుండా సబ్‌స్టేషన్ నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఒక వేళ ఎటువంటి సమస్య ఎదురైనా…ఉద్యోగులు ఎవరు లేకపోయినా ఈ స్మార్ట్ స్టేషన్ ద్వారా అధికారులకు సమాచారం అందుతుంది.

స్మార్ట్ సబ్‌ స్టేషన్ల వ్యవస్థను ఈపీడీసీఎల్‌ పరిధిలో పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టారు. విశాఖలోని ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్‌ సబ్‌స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నారు. గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్‌ స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌గా మారనుంది.

One Rupee Coin : వేలంలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిన రూపాయి నాణెం

ఈపీడీసీఎల్‌ పరిధిలోని అన్నింటిని స్మార్ట్‌ సబ్‌స్టేషన్లుగా మార్చాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం 3 వందల 34.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు 50 లక్షల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని విద్యుత్ శాఖ అంచనా వేసింది. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే ఆపరేట్ చేయనున్నారు.

గిడిజాల సబ్‌స్టేషన్‌ పరిధిలోని విద్యుత్‌ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్‌లైన్‌ ద్వారానే స్కాడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా కార్యకలాపాలను నియంత్రించే వీలుంది. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.