New Zealand : అప్పటివరకూ.. న్యూజిలాండ్‌లో విదేశీయులకు నో ఎంట్రీ..!

ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

New Zealand : అప్పటివరకూ.. న్యూజిలాండ్‌లో విదేశీయులకు నో ఎంట్రీ..!

New Zealand Five Step Plan

New Zealand : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. న్యూజిలాండ్ కూడా తమ దేశంలోకి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించింది. అక్టోబర్ వరకు టూరిస్టులకు తమ దేశంలో అనుమతి లేదని న్యూజిలాండ్ ప్రకటించింది. అప్పటివరకూ న్యూజిలాండ్ తమ సరిహద్దులను పూర్తిగా తిరిగి తెరిచే పరిస్థితి లేదు..

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా దేశ సరిహద్దులో ఆంక్షలను నెమ్మదిగా తొలగించనున్నట్టు ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) చెప్పారు. న్యూజిలాండ్‌ను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఐదు-దశల ప్రణాళికను ప్రధాని ఆర్డెర్న్ ప్రకటించారు. మహమ్మారి కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన కివీస్ కోసం హోటల్ క్వారంటైన్ అవసరాలను కూడా తీర్చినట్టు వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోని న్యూజిలాండ్ వాసులు ఫిబ్రవరి 27 నుంచి స్వదేశానికి తిరిగి రావొచ్చు. అయితే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లవచ్చు. రెండు వారాల తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చునని అన్నారు. ఇక వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, ఆస్ట్రేలియన్లు, టీకాలు తీసుకున్న విదేశీయులను తిరిగి దేశంలోకి అనుమతించడానికి సరిహద్దుల్లో క్వారంటైన్ విధానం క్రమంగా సడలించనున్నట్టు తెలిపారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దక్షిణ పసిఫిక్ మూసివేసిన దాదాపు రెండు ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచమంతో కలిసేందుకు సమయం ఆసన్నమైందని ఆర్డెర్న్ చెప్పారు. కుటుంబాలు, స్నేహితులు మళ్లీ ఏకం కావాలన్నారు. వ్యాపారాలు వృద్ధి చెందడానికి నైపుణ్యాలు అవసరమని సూచించారు. ఎగుమతిదారులు కొత్త కనెక్షన్ల కోసం తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు.

10 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ :
కొత్త విధానం ప్రకారం.. న్యూజిలాండ్ సైనిక సిబ్బంది పర్యవేక్షణలో 10 రోజుల క్వారంటైన్ ఉండాల్సిన అవసరం ఉండదు. అంతర్జాతీయంగా వచ్చిన విదేశీయులు ఎవరైనా సరే 10 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండవచ్చు. ప్రస్తుత క్వారంటైన్ విధానంలో నెలకు 800 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవసరాన్నిబట్టి 10 రెట్లు రూమ్స్ సౌకర్యాలు పెంచుతున్నారు.

ఈ క్రమంలో చాలా మంది న్యూజిలాండ్ వాసులు పూర్తిగా టీకాలు తీసుకున్నప్పటికీ సరిహద్దుల్లో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయని విమర్శించారు. స్థానికంగా MIQ అని పిలిచే క్వారంటైన్ సిస్టమ్ ద్వారా కరోనా మహమ్మారిపై న్యూజిలాండ్ విజయంలో కీలకమైన భాగమని ఆర్డెర్న్ చెప్పారు. ఐదు మిలియన్ల జనాభాలో ఇప్పటివరకూ కేవలం 53 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి.

ఈ విధానం ప్రజలకు కష్టంగా ఉన్నప్పటికీ ఎన్నో జీవితాను కాపాడిందని ప్రధాని పేర్కొన్నారు. న్యూజిలాండ్ గత నెలలో సరిహద్దు నియంత్రణలను సడలించాలని భావించింది. ఏప్రిల్‌లో పూర్తిగా తిరిగి తెరిచేందుకు రెడీ అయింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరింత ఆలస్యం అయింది.

ఇక న్యూజిలాండ్ లో అధిక టీకా రేటు ఉంది. దేశ జనాభాలో దాదాపు 95 శాతం మంది రెండు డోసుల టీకా వేసుకున్నారు. మూడో బూస్టర్‌ డోసు కూడా అందిస్తున్నారని ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లో పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయడం సాధ్యపడదని, అంతర్జాతీయంగా రాకపోకల దృష్ట్యా ఈ విధానం కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు.

Read Also : Telangana : బండి సంజయ్ అరెస్టు వ్యవహారం, ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఉన్నతాధికారులు