Nirav Modi: భారత్‌కు నీరవ్ మోదీని తీసుకొచ్చే అవకాశం.. ఇండియాకు అప్పగించాలని లండన్ హైకోర్టు తీర్పు

భారత్ లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి, విదేశాల్లో ఉంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్ కు అప్పగించవద్దని నీరవ్ మోదీ చేసుకున్న అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడం అన్యాయం/అణచివేత చర్య కాదని పేర్కొంది. అక్టోబర్ 12న తీర్పును లండన్ హైకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. నేడు దీనిపై తీర్పు ఇచ్చింది.

Nirav Modi: భారత్‌కు నీరవ్ మోదీని తీసుకొచ్చే అవకాశం.. ఇండియాకు అప్పగించాలని లండన్ హైకోర్టు తీర్పు

Nirav Modi

Nirav Modi: భారత్ లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి, విదేశాల్లో ఉంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్ కు అప్పగించవద్దని నీరవ్ మోదీ చేసుకున్న అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడం అన్యాయం/అణచివేత చర్య కాదని పేర్కొంది. అక్టోబర్ 12న తీర్పును లండన్ హైకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. నేడు దీనిపై తీర్పు ఇచ్చింది.

ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడం వెనుక భారత దర్యాప్తు సంస్థల కృషి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన నీరవ్ మోదీపై మోసం, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. నీరవ్ మోదీని భారత్‌ కు అప్పగించాలని ఫిబ్రవరిలో యూకేలోని ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పునే నీరవ్ మోదీ హైకోర్టులో సవాలు చేశారు. అయితే, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.

నీరవ్ మోదీని భారత్ కు తిరిగి తీసుకురావాలని చాలా కాలంగా భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. లండన్ హైకోర్టు తీర్పుపై నీరవ్ మోదీ లాయర్లు ఇప్పటివరకు స్పందించలేదు. తాము తదుపరి ఎలా వ్యవహరిస్తామన్న విషయాన్ని తెలపలేదు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..