Kashmir issue: కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణుబాంబు అవసరం లేదు.. లేకుంటే యుద్ధమే!

కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణుబాంబులు, అణ్వాయుధాలు అవసరం లేదని, ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమై, రెండు దేశాలు ప్రశాంతగా మారితే, రెండు దేశాల మధ్య విభేదాలు అనేవే ఉండవని అన్నారు ఇమ్రాన్ ఖాన్.

Kashmir issue: కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణుబాంబు అవసరం లేదు.. లేకుంటే యుద్ధమే!

Kashmir Issue

Pakistan’s PM Imran Khan: కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణుబాంబులు, అణ్వాయుధాలు అవసరం లేదని, ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమై, రెండు దేశాలు ప్రశాంతగా మారితే, రెండు దేశాల మధ్య విభేదాలు అనేవే ఉండవని అన్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఇమ్రాన్ ఖాన్ యుద్ధ ముప్పును ప్రస్తావిస్తూ.. అణుబాంబుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాశ్మీర్ సమస్య పరిష్కారం అయితే అణుబాంబు అవసరం లేదని ఇమ్రాన్ ఖాన్ ఒక విదేశీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పేదరికం మరియు అప్పులతో పోరాడుతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తరచూ అణుబాంబును గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే, భారతదేశాన్ని బెదిరించడంలో భాగమే ఇదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక విదేశీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ సమస్య పరిష్కారం దొరికినప్పుడే సమస్యలు పోతాయని, అప్పుడు మనకు అణ్వాయుధాలు అవసరం లేదన్నారు ఇమ్రాన్. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలిసినప్పుడు, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపెట్టడానికి చొరవ తీసుకోవాలని కోరుతానన్నారు ఇమ్రాన్ ఖాన్.

అమెరికా సంకల్పంతో సమస్యను పరిష్కారించాలనే చొరవ చూపిస్తే సమస్యను పరిష్కరించగలమని ఇమ్రాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాశ్మీర్ సమస్యపై ప్రపంచం జోక్యం చేసుకోకపోతే యుద్ధం జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఎప్పుడూ అణు బాంబుల విషయంలో వ్యతిరేకంగా ఉంటానని, మేము భారత్‌తో మూడుసార్లు పోరాడామని, అయితే ఇప్పుడు మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నందున, భారతదేశంతో యుద్ధం జరగట్లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ప్రపంచంలోని పెద్ద దేశాలు భారతదేశం మరియు పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, చేసుకుంటే మంచిదని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, కాశ్మీర్ పట్ల తన అదనపు శ్రద్ధ చూపిస్తూ, అణు యుద్ధం గురించి మాట్లాడుతూ.., యుద్ధం ఉంటే పాత యుద్ధం లాగా ఉండదని, పూర్తి కథ వేరేలా ఉంటుందని అన్నారు.