North Korea: అమెరికా, దాని మిత్ర‌దేశాలకు ఉత్త‌ర‌ కొరియా హెచ్చ‌రిక‌

అమెరికా, దాని మిత్ర‌దేశాలు క‌లిసి కొరియా స‌రిహ‌ద్దుల వ‌ద్ద హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని, తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటాయ‌ని ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రించింది. అమెరికా, దాని మిత్ర‌దేశాలు సైనిక విన్యాసానాల‌ను కొన‌సాగిస్తుండ‌డంతో ఉత్త‌రకొరియా ఈ హెచ్చరిక చేసింది. త‌మ దేశ ఆయుధ సంప‌త్తిని మ‌రింత పెంచుకునేలా, కొరియాను మ‌రింత‌ క్లిష్టమైన యుద్ధ ప్రాంతంగా చేస్తున్నార‌ని మండిప‌డింది.

North Korea: అమెరికా, దాని మిత్ర‌దేశాలకు ఉత్త‌ర‌ కొరియా హెచ్చ‌రిక‌

Kim

North Korea: అమెరికా, దాని మిత్ర‌దేశాలు క‌లిసి కొరియా స‌రిహ‌ద్దుల వ‌ద్ద హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని, తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటాయ‌ని ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రించింది. అమెరికా, దాని మిత్ర‌దేశాలు సైనిక విన్యాసానాల‌ను కొన‌సాగిస్తుండ‌డంతో ఉత్త‌రకొరియా ఈ హెచ్చరిక చేసింది. త‌మ దేశ ఆయుధ సంప‌త్తిని మ‌రింత పెంచుకునేలా, కొరియాను మ‌రింత‌ క్లిష్టమైన యుద్ధ ప్రాంతంగా చేస్తున్నార‌ని మండిప‌డింది.

అమెరికా త‌మ‌కు విరుద్ధ‌మైన విధానాల‌ను అనుస‌రిస్తున్నంత కాలం తాము ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేమ‌ని ఉత్త‌ర‌కొరియా చెప్పింది. కొరియన్ ద్వీపకల్పంలో మిలట‌రీ, రాజ‌కీయ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారాయ‌ని తెలిపింది. అమెరికా, దాని మిత్ర‌దేశాలు ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగేలా కుయుక్తులు ప‌న్నుతుండ‌డం, శ‌త్రుత్వ‌పూరిత చ‌ర్య‌లకు పాల్ప‌డుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పింది.

కాగా, ఉత్త‌ర‌కొరియా అణ్వాయుధాల‌ను పెంచుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంద‌ని అమెరికా నిఘా శాఖ కొన్ని నెల‌ల క్రితం తెల‌ప‌డంతో జ‌పాన్, ద‌క్షిణ‌కొరియా కూడా అప్ర‌మ‌త్త‌య్యాయి. ఇటీవ‌ల కూడా ఉత్త‌రకొరియా వ‌రుస‌గా క్షిప‌ణి ప్ర‌యోగాలు చేసి క‌ల‌క‌లం రేప‌డంతో ఆ దేశ చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి.

Pakistan Economic Crisis: పాకిస్థాన్‌కు మరో తలనొప్పి.. భారీ జరిమానా చెల్లించాలంటున్న ఇరాన్ ..