Hypersonic Missile : తగ్గేదే లే అంటున్న కిమ్..హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా మరో క్షిపణిని పరీక్షించింది. బుధవారం ఓ హైపర్ సోనిక్ మిసైల్ ను ఉత్తరకొరియా విజయవంతంగా ప్రయోగించినట్లు గురువారం ఆ దేశ

Hypersonic Missile :  తగ్గేదే లే అంటున్న కిమ్..హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం

Missile

North Korea :  ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా మరో క్షిపణిని పరీక్షించింది. బుధవారం ఓ హైపర్ సోనిక్ మిసైల్ ను ఉత్తరకొరియా విజయవంతంగా ప్రయోగించినట్లు గురువారం ఆ దేశ మీడియా తెలిపింది. 700 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో మిసైల్ ఛేధించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా(కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ-KCNA)తెలిపింది. సియోల్‌(దక్షిణ కొరియా రాజధాని)లోని రక్షణ అధికారులు ధృవీకరించడానికి ముందు తాజా ప్రయోగాన్ని బుధవారం తెల్లవారుజామున మొదట జపాన్ కోస్ట్ గార్డ్ గుర్తించింది.

2022లో ఉత్తరకొరియా చేసిన తొలి ఆయుధ పరీక్ష ఇదే. తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కొత్త ఏడాది రోజు ప్రసంగంలో చెప్పిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్ష చోటు చేసుకోవడం గమనార్హం. కాగా,గతేడాది సెప్టెంబర్ లో ఉత్తరకొరియా తొలిసారి హైపర్ సోనిక్ మిసైల్ ను పరీక్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో హైపర్ సోనిక్ మిసైల్ ని ప్రయోగించింది.

“హైపర్‌సోనిక్ క్షిపణి సెక్టార్‌లో పరీక్షా ప్రయోగాలలో వరుస విజయాలు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అవి దేశ వ్యూహాత్మక సాయుధ దళాన్ని ఆధునీకరించే పనిని వేగవంతం చేశాయి” అని KCNA తెలిపింది. కాగా,బాలిస్టిక్ క్షిపణులలా కాకుండా,హైపర్‌సోనిక్ ఆయుధాలు తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాల వైపు ఎగురుతాయి,ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగాన్ని(దాదాపు 6,200 కి.మీ.)సాధించగలవు.

దక్షిణ కొరియా, అమెరికాతో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఉత్తర కొరియా గతేడాది పలు రకాల క్షిపణులను పరీక్షించింది.  అమెరికా,చైనా సహా కేవలం కొన్ని దేశాలు మాత్రమే హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తుండగా..ఈ జాబితాలో ఉత్తరకొరియా కూడా చేరింది.

ALSO READ Suicide Bombers : తాలిబన్ మరో సంచలన నిర్ణయం..ఆర్మీలోకి సూసైడ్ బాంబర్లు!