North Koreans : ఆకలి తీరాలా, నల్ల హంసలు తినండి..కిమ్ సూచన

ఆకలి సమస్య నుంచి బయటపడేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తన ప్రజలకు ఓ పరిష్కారం చూపించారు.

North Koreans : ఆకలి తీరాలా, నల్ల హంసలు తినండి..కిమ్ సూచన

Kim

Delicious Black Swans : ఆకలి సమస్య నుంచి బయటపడేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తన ప్రజలకు ఓ పరిష్కారం చూపించారు. దీని గురించి విపరీతంగా ప్రచారం కూడా మొదలెట్టారు. ఉత్తర కొరియా ప్రజల ఆకలి తీరేందుకు నల్ల హంసలను తినాల్సిందిగా సూచిస్తున్నారు కిమ్‌. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక.. ప్రొటీన్‌ రిచ్‌ ఆహారమని ప్రకటించారు. నల్ల హంసల సంఖ్యను పెంచడం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌.

Read More : Ayodhya : అయోధ్య జిగేల్..జిగేల్…దీపాలతో వెలుగు జిలుగులు

ఇప్పటికే క్వాంగ్‌ఫో డక్ ఫామ్‌లో, ఉత్తర కొరియా ప్రావిన్స్‌లోని సౌత్ హమ్‌గ్‌యాంగ్‌లో నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా జాతీయ మీడియాలో ప్రసారం చేశారు. అంతేకాక జనాలను నల్ల హంసలు తినేలా ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. నల్ల హంస మాంసం రుచిగా ఉండటమే కాక.. ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుందని.. ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని జాతీయా మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు.

Read More : T20 World Cup 2021 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జోరు.. శ్రీలంకపై ఘన విజయం

కరోనా మొదలైనప్పుడు విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఇంకా అమలు చేస్తోంది. సరిహద్దులను మూసి వేసింది. ప్యాంగ్యాంగ్‌ పట్టాణాన్ని 2025 వరకు తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ప్రకటించింది. సరిహద్దుల మూసివేత, కఠిన నియమాల కారణంగా ఈ ఆహార సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే 25 మిలయన్ల దేశవాసులు ఆకలితో అల్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో తనకు తోచిన విధంగా పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు కిమ్‌ జోంగ్‌.