Ayodhya : అయోధ్య జిగేల్..జిగేల్…దీపాలతో వెలుగు జిలుగులు

రామ జన్మభూమి అయోధ్య దేదీప్యమానంగా వెలుగొందుతోంది. దీపావళికి ముందే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది.

Ayodhya : అయోధ్య జిగేల్..జిగేల్…దీపాలతో వెలుగు జిలుగులు

Ayodhya

Ayodhya Deepotsava 2021 : రామ జన్మభూమి అయోధ్య దేదీప్యమానంగా వెలుగొందుతోంది. దీపావళికి ముందే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఏటా.. దీపావళికి ఒక్కరోజు ముందు నిర్వహించే దీపోత్సవ్ కోసం.. అయోధ్య సిద్ధమవుతోంది. విద్యుత్‌ దీప కాంతులతో అయోధ్య జిగేల్‌ జిగేల్‌ మంటోంది. ఇప్పటికే దీపోత్సవ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం మాత్రం భారీ ఎత్తున దీపాలతో అయోధ్యను అలంకరించనున్నారు.

Read More : Scotland : వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండా

దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో తొమ్మిది లక్షల మట్టి దీపాలను బుధవారం వెలిగించనున్నారు. అయోధ్య రామ మందిరంతో పాటు, అన్ని దేవాలయాల్లో మట్టి దివ్వెలు వెలిగించనున్నారు. ఇటు రాష్ట్రంలోని 45లక్షల ఇళ్లల్లో కూడా మట్టి దీపాలు వెలిగించనున్నట్లు సీఎం యోగి తెలిపారు. దీపోత్సవానికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు… గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం సభ్యులు హాజరవుతారు.

Read More : AHA 2.0: దీపావ‌ళి వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

దీంతో ఇప్పటికే ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. నగరాన్ని మొత్తం సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యగా భారో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది.