Japanese Researchers: ముక్కు పొడవును బట్టి పురుషాంగ పరిమాణం ఉంటుందట.. అధ్యయనం ఎవరిపై చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

జపాన్ శాస్త్రవేత్తలు పురుషుడి పురుషాంగ పరిమాణాన్ని ముక్కుతో అంచనా వేయవచ్చంటూ ఓ అధ్యయనంలో తేల్చారు. ఇందుకోసం 126 మందిపై పరిశోధనలు జరిపారు. అయితే వీరు పరిశోధనలు జరిపింది ఎవరిపైనో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

Japanese Researchers: ముక్కు పొడవును బట్టి పురుషాంగ పరిమాణం ఉంటుందట.. అధ్యయనం ఎవరిపై చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Man Nose length

Japanese Researchers: జపాన్ శాస్త్రవేత్తలు పురుషుడి పురుషాంగ పరిమాణాన్ని ముక్కుతో అంచనా వేయవచ్చంటూ ఓ అధ్యయనంలో తేల్చారు. 30 నుంచి 50ఏళ్ల వయస్సు కలిగిన 126 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధనలో ముక్కుకు పురుషాంగ పరిమాణానికి పోలిక ఉందని, ముక్కు పొడవు ఎంతఉంటే పురుషుడి పురుషాంగ పరిమాణం కూడా అంతే ఉంటుందని అన్నారు. అయితే ఇదిపక్కా అని చెప్పడానికి ఇంకా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.

Viral Video: బీచ్‌లో బికినీలతో అందగత్తెలు సందడి చేస్తుంటే.. చీరకట్టులో మహిళ ఎంట్రీ.. కళ్లన్నీ అటువైపే

1971లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. పురాతన రోమన్ సమాజంలో ముక్కు పొడవు పురుషాంగ పరిమాణానికి సూచికగా పరిగణించేవారట. వ్యక్తి ముక్కు పరిమాణంపైనే అంగపరిమాణం ఆధారపడి ఉంటుందని అప్పట్లో వారు నమ్మేవారట. అప్పట్లో అక్రమసంబంధాలు పెట్టుకునే వాళ్లను, లైంగిక వేధింపులు పాల్పడే వారి ముక్కులు కోసి శిక్షించేవారట. అయినప్పటికీ ముక్కు పరిమాణం, పురుషాంగం మధ్య సంబంధం గత సంవత్సరం వరకు శాస్త్రీయంగా నిరూపించబడలేదు. జపనీస్ పరిశోధకుల బృందం వారి అధ్యయనంలో పెద్ద ముక్కులు ఉన్న పురుషులకు దీర్ఘ పురుషాంగం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..

క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 126 మందిపై పరీక్షలు జరిపారు. అయితే వీరు పరీక్షలు చేసింది బతికున్న వారిపై కాదంట.. మరణించిన పురుషులపై పరిశోధన చేశారట. వారు మరణించిన మూడు రోజుల పాటు పరీక్షించారు. చనిపోయిన వ్యక్తికి అంగస్తంభన ఉండదు. అయితే పరిశోధకులు మృతదేహాల యొక్క పురుషాంగంను సాగదీసి దాని పొడవును పరీక్షించారు. ప్రతి మృతదేహం యొక్క పురుషాంగం ఎత్తు, బరువు, వివిధ శరీర భాగాల పరిమాణం వంటి ఇతర శరీర కొలతలతో పోల్చారు. ఈ వింత ప్రయోగం యొక్క ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. పెద్ద ముక్కు కలిగిన పురుషులలో పురుషాంగం పొడవు పెద్దగా, చిన్న ముక్కులు కలిగిఉన్న మృతదేహాల్లో తక్కువ పొడవు పురుషాంగం కలిగి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ అంశంపై పరిశోధనలు పూర్తిస్థాయిలో చేయాల్సి ఉందని, మరికొన్ని పరిశోధనల తరువాత ఈ అంశంపై మరింత స్పష్టత ఇచ్చేందుకు వీలుంటుందని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.