Nostradamus 2022 Predictions: 2022 గురించి నోస్ట్రాడమస్ ఏమన్నాడంటే!
2022 సంవత్సరంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ వివరాలను ఫ్రాన్స్ కి చెందిన నోస్ట్రాడమస్ అనే కాలజ్ఞాని ఐదు వందల ఏళ్ల క్రితమే ఊహించాడట

Nostra
Nostradamus 2022 Predictions: భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరికి కుతూహుళంగా ఉంటుంది. భవిష్యవాణి చెప్పేవారు ఉంటే చెవులారా వింటారంట ప్రజలు. 2022 సంవత్సరంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ వివరాలను ఫ్రాన్స్ కి చెందిన.. నోస్ట్రాడమస్ అనే ఆస్ట్రాలజర్(కాలజ్ఞాని) ఐదు వందల ఏళ్ల క్రితమే ఊహించాడట. నోస్ట్రాడమస్ అంటే కాలజ్ఞానిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను 500 ఏళ్ల క్రితమే ఆయన ఊహించి రాసాడని, ఆయన రాసిన అనేక సంఘటనలు నిజం అయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. ఇక 2022లో జరగబోయే భవిష్యత్ గురించి నోస్ట్రాడమస్ ఏం చెప్పాడంటే..
కృత్రిమ మేధ: 2022లో కృత్రిమ మేధ వాడకం పెరిగిపోతుందని..నోస్ట్రాడమస్ లెక్కగట్టాడు. కృత్రిమమేధ దానంతట అదే మేధోసంపత్తిని అభివృద్ధి చేసుకుని మనుషుల పై పెత్తనం చెలాయిస్తుందని పేర్కొన్నాడు. మనుషులు ఉపయోగిస్తున్న యంత్రపరికరాలను కృత్రిమమేధ శాసిస్తుందని అంచనా వేసాడు. ప్రతిదీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Kia New Car: “కారెన్స్” కొత్త ఏడాదిలో కియా నుంచి కొత్త కారు
యూరోపియన్ యూనియన్ పతనం: 2022లో యూరోపియన్ యూనియన్ పతనం అవుతుందని.. రాజకీయ సంక్షోభంతో యూనియన్ అంతం అవుతుందని నోస్ట్రాడమస్ అంచనా వేసాడు. ఇప్పటికే బ్రెక్జిట్ తో యూరోప్ దేశాలు అశాంతియుతంగా తయారవుతుండగా.. ఈ ఏడాది చివరి నాటికీ అది రాజకీయ రంగు పులుముకుని విషాదంగా ముగుస్తుందని నోస్ట్రాడమస్ తన భవిష్యవాణిలో పేర్కొన్నట్టు..అనువాదికులు పేర్కొన్నారు.
భూమిపై ఉల్క దాడి, గ్లోబల్ వార్మింగ్: నోస్ట్రాడమస్ చెప్పిన భవిష్యవాణి ప్రకారం 2022లో భూమిపై ప్రకృతి విరుద్ధమైన మార్పులు జరుగనున్నాయి. ఉల్కా పాతం జరిగి భూమి తీవ్రంగా నష్టపోతుందని, లేదా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమిపై ప్రకృతి విలయ తాండవం తప్పదని హెచ్చరించాడు. అతను చెప్పినట్టుగానే 2022 డిసెంబర్ లో భూమిపైకి గ్రహశకలాలు దూసుకువచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తుంది.
Also read: Vaishno Devi shrine : కారణం అదే..వైష్లోదేవి ఆలయంలో తొక్కిసలాటపై డీజీపీ
క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం: 2022లో నగదు పెట్టెల్లో మూలిగే డబ్బు రూపం మార్చుకుని.. రహస్య రూపంలోకి మారిపోతుందని నోస్ట్రాడమస్ అంచనా వేసాడు. బంగారం, వెండి వంటి మారకాలు తగ్గిపోయి.. వాటి స్థానంలో కంటికి కనిపించని రహస్య డబ్బు రాజ్యమేలుతుందని నోస్ట్రాడమస్ చెప్పినట్లు భవిష్యవాణి అనువాదకులు పేర్కొన్నారు.
పెద్ద రాజ్యాధినేతను కోల్పోవడం: 2022లో ఒక పెద్ద రాజ్యాధినేతను ప్రపంచం కోల్పోతుందని, అతని స్థానంలో మరొక రాజుని నియమిస్తారని నోస్ట్రాడమస్ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజులూ లేరూ రాజ్యాలు లేవు. మరి ఎవరిని ఉద్దేశించి అతను ఈ విధంగా రాసి ఉంటాడనే విషయం మిస్టరీగా మారింది.
ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నీ.. గతంలో కొందరు ఫ్రెంచ్ పండితులు ఇతర భాషల్లోకి అనువదించగా.. వాటిని వివిధ దేశాల ప్రజలు నమ్ముతున్నారు. ఇవి జరుగుతాయా లేదా అనేది ఈ 2022 చివరిలో తెలుస్తుంది.
Also read: KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి