Kia New Car: “కారెన్స్” కొత్త ఏడాదిలో కియా నుంచి కొత్త కారు

కియా సంస్థ "కారెన్స్"(Carens) అనే కొత్త ఎస్యూవీని భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. 2021 డిసెంబర్ లోనే Carens కారును ఆవిష్కరించిన కియా సంస్థ

Kia New Car: “కారెన్స్” కొత్త ఏడాదిలో కియా నుంచి కొత్త కారు

Kia

Kia New Car: 2022 కొత్త సంవత్సరం ఆరంభం నుంచే కార్ల కంపెనీలు భారత మార్కెట్లో సందడి షురూ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కొరియా వాహన దిగ్గజం “కియా మోటార్స్” భారత్ లో తన ఎస్యూవీ/ఎంపీవీ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించే దిశగా ప్రణాళిక వేసింది. ఈక్రమంలో కియా సంస్థ “కారెన్స్”(Carens) అనే కొత్త ఎస్యూవీని భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. 2021 డిసెంబర్ లోనే Carens కారును ఆవిష్కరించిన కియా సంస్థ.. 2022 జనవరి 14 నుంచి దేశీయంగా బుకింగ్స్ ప్రారంభించింది.

Also Read: Vangaveeti Radha: వంగవీటి రాధాను కలిసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు

మిడ్ సెగ్మెంట్ లో 7/6 సీట్ ఆప్షన్స్ తో వస్తున్న కారెన్స్ కారులో లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. కనెక్ట్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు వెనుక భాగంలో వన్-టచ్-ఫోల్డింగ్ సీట్లు వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. ప్రస్తుతం కియా సెల్టోస్ లో అమర్చిన 1.5 లీటర్ ఇంజిన్నే ఈ కారెన్స్ కారులో అమర్చారు. “కారెన్స్” కారు డీజిల్, మరియు టర్బో పెట్రోల్ రకాల్లో లభిస్తుంది. అయితే పవర్, పిక్అప్ లో తేడా ఉంటుందని కార్ రివ్యూ సంస్థలు పేర్కొన్నాయి.

2021 డిసెంబర్ లో ఆవిష్కరించిన ఈ కియా “కారెన్స్” కారు మిడ్ సెగ్మెంట్ ఎస్యూవీ/ఎంపీవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మహీంద్రా xuv700, టాటా Safari, ఇన్నోవా crysta, హ్యుండయ్ Alcazar వంటి కార్లకు మంచి పోటీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు కియా మాతృసంస్థ హ్యుండయ్ లోనూ 7/6 సీట్ కార్లు(మిడ్ సెగ్మెంట్) భారత్ లో విడుదల కాలేదు. ఇటీవలే వచ్చిన హ్యుండయ్ alcazar కాస్త నిరాశపరచడంతో, ప్రస్తుతం రానున్న “కారెన్స్”పై కియా భారీ అంచనాలు పెట్టుకుంది

Also Read: KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి