Vangaveeti Radha: వంగవీటి రాధాను కలిసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు

తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన వంగవీటి రాధాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది

Vangaveeti Radha: వంగవీటి రాధాను కలిసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు

Radha

Updated On : January 1, 2022 / 6:20 PM IST

Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన వంగవీటి రాధాను శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. శనివారం విజయవాడ చేరుకున్న చంద్రబాబు..వంగవీటి రాధా నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాధా చేసిన ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా నాయకుడిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధకు సూచించిన చంద్రబాబు.. భద్రత విషయంలో అశ్రద్ధ వహించవద్దని హితవు పలికారు. రాధా భద్రతకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు.. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని అన్నారు. వంగవీటి రాధ చేసిన రెక్కీ ఆరోపణల పై సమగ్ర విచారణ జరిపించాలని ఇటీవల ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ కూడా రాసారు.

Also Read: KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

వంగవీటి రాధాను కలిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసారు. రాధా హత్యకు రెక్కీ జరిగిందని చెప్పినా..పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు. ఘటనపై దర్యాప్తు జరపాలంటూ రాష్ట్ర డీజీపీకి లేఖరాసి 7 రోజులు కావస్తున్నా.. పోలీసులు ఇంత వరకు ఏమి చెప్పలేదని చంద్రబాబు అన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దోషులు ఎవరో పట్టుకునే అవకాశం ఉందని.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. అనే విషయాలపై పోలీసుల వద్దనున్న ఆధారాలు ఏమున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఇదిలా ఉంటే.. తన తండ్రి వర్ధంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీతో కలిసి నివాళులర్పించిన వంగవీటి రాధా.. ఆరోజు రెక్కీ ఆరోపణలు చేసారు. నేడు ప్రతిపక్ష నేత చంద్రబాబు రాధాను కలవడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది

Also read: Tourist in Kerala: టూరిస్ట్ మద్యాన్ని పారబోసిన పోలీసులు, రంగంలోకి సీఎం ఆఫీస్