Tourist in Kerala: టూరిస్ట్ మద్యాన్ని పారబోసిన పోలీసులు, రంగంలోకి సీఎం ఆఫీస్

కేరళ రాష్ట్రంలో విదేశీ పర్యాటకుడి మద్యాన్ని నేలపాలు చేసేలా ప్రవర్తించిన పోలీస్ ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. ఏకంగా సీఎం కార్యాలయం ఈ ఘటనపై స్పందించడం విశేషం

Tourist in Kerala: టూరిస్ట్ మద్యాన్ని పారబోసిన పోలీసులు, రంగంలోకి సీఎం ఆఫీస్

Swedish

Tourist in Kerala: కేరళ ప్రభుత్వం పర్యాటకులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలిపే ఘటన ఇది. మద్యం తీసుకువెళ్తున్న విదేశీ పర్యాటకుడిని నిలువరించి.. అతని మద్యాన్ని నేలపాలు చేసేలా ప్రవర్తించిన పోలీస్ ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. ఏకంగా సీఎం కార్యాలయం ఈ ఘటనపై స్పందించడం ఘటన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వివరాల్లోకి వెళితే. కేరళ రాష్ట్రంలోని కోవలంలో.. డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ప్రజలు మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. స్వీడన్ కు చెందిన స్టీవెన్ అనే పర్యాటకుడు సైతం అక్కడే మూడు మద్యం సీసాలను(As per Govt. rule) కొనుగోలు చేసాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్టీవెన్ ను తనిఖీ పేరుతో స్థానిక పోలీసులు ఆపారు.

మద్యానికి సంబంధించి బిల్లు చూపాలంటూ పోలీసులు స్టీవెన్ ను కోరగా.. దుకాణంలో రద్దీ కారణంగా బిల్లు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో మద్యం అక్రమంగా కొనుగోలు చేసావంటూ పోలీసులు స్టీవెన్ పై ఆరోపణలు చేసారు. అయితే.. తాను నేరుగా ప్రభుత్వ దుకాణంలోనే మద్యాన్ని కొనుగోలు చేశానన్న స్టీవెన్, కొంచెం సమయం ఇస్తే తిరిగి వెళ్లి బిల్లు తెస్తానంటూ వేడుకున్నాడు. స్టీవెన్ వినతిని తిరస్కరించిన పోలీసులు, మద్యం సీసాలను వదిలి వెళ్లాలని సూచించారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన స్టీవెన్.. రెండు సీసాల మద్యాన్ని రోడ్డు పక్కన పారబోశాడు. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా..అప్రమత్తమైన పోలీసులు, బిల్లు తీసుకువచ్చి మిగిలిన ఒక్క సీసాను తీసుకువెళ్లమంటూ స్టీవెన్ కు సూచించారు.

Also read: Viral Video: పెళ్లి పీటలపై నుంచి నేరుగా పానీపూరి తినేందుకు వెళ్లిన పెళ్లి కూతురు

ఇక ఈఘటన తాలూకు వీడియోలు, సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రంగంలోకి దిగిన కేరళ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి PA ముహమ్మద్ రియాస్, పర్యాటకుడి విచారానికి కారణమైన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసారు. అంతే కాదు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్‌ను ఆదేశించారు. విదేశీ పర్యాటకుడిపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేసారు.

Also read: Emerald Lingam : వ్యాపారవేత్త బ్యాంకు లాకర్‌లో రూ.500 కోట్ల విలువైన మరకత శివలింగం

కరోనా కారణంగా కేరళ రాష్ట్రంలో పర్యాటక రంగం కుదేలవగా.. పర్యాటకులను ఆకర్శించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడిపుడే పర్యాటకులు వస్తుండగా, ఇలాంటి పోలీసు చర్యల వల్ల పర్యాటకులు వెనకడుగు వేస్తారని అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు. పర్యాటకులకు సహకరించాల్సిన పోలీసులు వారిని ఇబ్బంది పెట్టకూడదని సీఎం కార్యాలయం హెచ్చరించింది. ఇదిలా ఉంటె ఘటనపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని ఈ ఘటన తెలియజేస్తోందన్నారు. సీపీఐ(ఎం) స్థానిక వర్గాలు పోలీసులను నియంత్రిస్తున్నాయని ఈ ఘటన రుజువు చేస్తోందంటూ విమర్శించారు.

Also Read: Road Accident: జహీరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం, చిన్నారి సహా నలుగురు మృతి