Emerald Lingam : వ్యాపారవేత్త బ్యాంకు లాకర్‌లో రూ.500 కోట్ల విలువైన మరకత శివలింగం

ఓ వ్యాపారవేత్త బ్యాంకు లాకర్ నుంచి మరకత శివలింగాన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తున్న ఈ శివలింగం విలువ రూ.500 కోట్లు ఉంటుందని..

Emerald Lingam : వ్యాపారవేత్త బ్యాంకు లాకర్‌లో రూ.500 కోట్ల విలువైన మరకత శివలింగం

Emerald Lingam

Updated On : January 1, 2022 / 5:00 PM IST

Emerald Lingam : తమిళనాడులోని తంజావూరులో ఓ వ్యాపారవేత్త బ్యాంకు లాకర్ నుంచి మరకత శివలింగాన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తున్న ఈ శివలింగం విలువ రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇది 2016లో నాగపట్టణం జిల్లాలోని తిరుకువలై శివాలయంలో చోరీకి గురైనదేనా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

తంజావూరులోని ఓ ఇంట్లో పురాతన విగ్రహాలు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తంజావూరులోని అరులనంద నగర్‌ సెవెన్త్ క్రాస్ లంగ్వల్ హోమ్స్‌లో తనిఖీలు చేశారు. కుటుంబసభ్యులను ప్రశ్నించారు. తమ దగ్గర మరకత శివలింగం ఉన్నట్లు కుటుంబసభ్యులు అంగీకరించారు. తన తండ్రి తంజావూరులోని బ్యాంకు లాకర్‌లో ఓ పురాతన శివలింగాన్ని ఉంచినట్లు వ్యాపారవేత్త కొడుకు అరుణ్ చెప్పాడు.

Vitamin D : శరీరానికి ఎండ తగలకపోతే… విటమిన్ డి లోపిస్తుందా?

కాగా, తన తండ్రి సామియప్పన్‌కు ఈ శివలింగం ఎలా వచ్చిందో తనకు తెలియదని అరుణ్ పోలీసులతో చెప్పాడు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ధర్మపురం ఆధీనం వంటి కస్టోడియన్లతో శివలింగాన్ని తనిఖీ చేయించామని, ఇది అసలైన మరకత శివలింగమేనని వారు చెప్పారని అధికారులు తెలిపారు. సైంటిఫిక్ అనాలసిస్ చేసి, ఈ శివలింగం ఏ దేవాలయానికి చెందినదో తెలుసుకుంటామని వెల్లడించారు.