Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

ప్రపంచవ్యాప్తంగా నిన్న 8,03,693 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 5,476 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది.

Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

France 11zon

one lakh corona cases in France : ఫ్రాన్స్ లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఒక్క రోజే లక్ష కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్న 8,03,693 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 5,476 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 2,42,79,822 యాక్టివ్ కేసులు కాగా, 54,08,723 మరణాలు నమోదు అయ్యాయి.

మరోవైపు కరోనా కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. 108 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందికి ఈ వేరియంట్ సోకినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క యూకేలోనే 90 వేల కేసులు నమోదు అయ్యాయి. డెన్మార్క్‌లో మరో 30 వేలమంది దీని బారినపడ్డారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌తో 26మంది మృతి చెందారు.

Drug Seize Case : గుజరాత్‌ మాదకద్రవ్యాల స్వాధీనం కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 358 మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వ్యాపించినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ… ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఒమిక్రాన్ వైరస్ పండగలను కూడా మింగేస్తోంది. ప్రజలకు సంతోషం లేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రిస్టియన్లు క్రిస్మస్ సంబరాలు కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. అమెరికా నుంచి యూరోప్ వరకు అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఆంక్షలను విధించడంతో ఆ ప్రభావం క్రిస్మస్ సంబరాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా 5వేల 700లకు పైగా ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోయారు.