Drug Seize Case : గుజరాత్‌ మాదకద్రవ్యాల స్వాధీనం కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

కరాచీకి చెందిన హజీ హసన్‌ స్థానికంగా అతిపెద్ద డ్రగ్‌ డీలర్‌. అనేక దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ డాన్‌గా చలామణి అవుతున్నాడు.

Drug Seize Case : గుజరాత్‌ మాదకద్రవ్యాల స్వాధీనం కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Drug

Sensational matters in drug seize case : గుజరాత్‌ తీరంలో 400కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ మత్తు పదార్థాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ ఫిషింగ్‌ బోటులో ఆరుగురు సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టయిన వారిలో ఒకరు కరాచీ డ్రగ్స్‌ డాన్‌ హజి హసన్‌ కుమారుడు మహ్మద్‌ సాజిద్‌ వాఘెర్‌ అని అధికారులు గుర్తించారు.

కరాచీకి చెందిన హజీ హసన్‌ స్థానికంగా అతిపెద్ద డ్రగ్‌ డీలర్‌. అనేక దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ డాన్‌గా చలామణి అవుతున్నాడు. గతంలో దుబాయిలో ఓ డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ఐదేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చాడు. తాజాగా భారత్‌కు రవాణా చేస్తున్న సరకుతో పాటు తన కొడుకు సాజిద్‌ను పంపించాడు. సాజిద్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మత్స్యకారుల ముసుగులో 77 కిలోల హెరాయిన్‌ను ఫిషింగ్‌ బోటులో తీసుకుని కరాచీ పోర్ట్‌ నుంచి బయల్దేరారు.

Omicron : పండగలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా 5,700లకు పైగా ఫ్లైట్స్ రద్దు

అయితే కచ్ జిల్లా జాఖౌ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది గుర్తించారు. అనుమానాస్పదంగా కన్పించడంతో తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సాజిద్‌, మిగతా వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు