Ostrich Running On Road: లాహోర్‌ రోడ్లపై నిప్పుకోడి హల్ చల్..వాహనదారులతో పోటీగా పరుగులు

ఓ నిప్పుకోడి పాకిస్థాన్ లోని లాహోర్ రోడ్లపై పరుగులు పెట్టింది. వాహనదారులతో పోటీ పడి మరీ పరుగులు పెట్టి అందరిని ఆకర్షించింది.

Ostrich Running On Road: లాహోర్‌ రోడ్లపై నిప్పుకోడి హల్ చల్..వాహనదారులతో పోటీగా పరుగులు

Ostrich Running On Road

Updated On : October 28, 2021 / 5:13 PM IST

Ostrich Spotted Running On Lahore street Road : నిప్పుకోడితో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తుంది. పక్షి జాతుల్లో ఎగరలేనిదే అయినా పరుగులో మాత్రం పరుగుల రాణి పీటీ ఉషను మించిపోతుంది. గతంలో ఓ సారి నిప్పుకోడితో దుబాయ్ యువరాజుకు పందెం వేసుకున్న విషయం తెలిసిందే. వారి పరుగు పందెంలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కనపెడితే..ఓ నిప్పుకోడి పాకిస్థాన్ లోని లాహోర్ రోడ్లపై పరుగులు పెట్టి అందరిని ఆకర్షించింది. రోడ్డుపై వెళ్లి వాహనాలతో పాటు పరుగులు పెట్టింది నిప్పుకోడి.

లాహోర్‌ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్‌లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్‌ రోడ్‌ పైకి వచ్చి..వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది ఆకోడిలో ఒక కోడి. కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్‌ న్యూస్‌ వెల్లడించింది.

Read more : నిప్పుకోడితో దుబాయ్ యువరాజు సైకిల్ రేస్..గెలుపెవరిదో తెలుసా?

దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిలియన్‌ వ్యూవ్స్‌తో నిప్పుకోడి పరుగును మించి దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్‌లో బస్‌ను అందుకోవాడానికా? అని ఒకరు అంటే..ఈ కోడిని ఒలింపిక్స్ కు పంపిస్తే మెడల్ తెచ్చేయటం ఖాయం అంటున్నారు మరికొందరు.