Pak- Afghan : అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది?

అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది? అసలు పాకిస్థాన్ కు అఫ్ఘాన్ కు మధ్య ఏం జరుగుతోంది?

Pak- Afghan : అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది?

Pak Afghan

Pak- Afghan :అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య అసలేం జరుగుతోంది..? అప్ఘాన్ ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..? అమెరికా బలగాలు అప్ఘాన్‌ ను వీడి వెళ్లడంలోనూ, తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు వైఖరి మార్చుకోవడానికి కారణమేంటి..? అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది?గాలు అప్ఘానిస్తాన్ ను వీడి వెళ్లిన తర్వాత తాలిబన్లు ఆ దేశ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి అన్ని విధాలా సహకరించిన దేశం పాకిస్తాన్.

మిగతా ప్రపంచమంతా తాలిబన్ల అరాచకంపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంటే పాకిస్తాన్ మాత్రం తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు అన్నివిధాలా సహకరించింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ఒకరకంగా అప్ఘాన్ తాలిబన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ అనుంగు మిత్రదేశంగా ఉంది. అసలు ప్రభుత్వంలో ఎవరెవరు ఉండాలన్నది కూడా పాకిస్తాన్ నిర్దేశించినట్టూ వార్తలొచ్చాయి. కానీ ఇంతలోనే ఏమయిందో ఏమో కానీ….అప్ఘాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరాయి. ఇప్పుడు వ్యవహారం వైమానిక దాడులదాకా వెళ్లింది.

Also read : Afghanistan : ఆఫ్గాన్‌పై పాక్ సైన్యం రాకెట్ దాడి.. ఆరుగురు మృతి.. పాక్‌ను హెచ్చరించిన తాలిబాన్ అధికారులు

అఫ్గానిస్తాన్‌లోని ఖోస్త్, కునర్ ప్రావిన్స్‌ ల్లో పాకిస్తాన్ విమానాలు, రాకెట్లతో దాడికి దిగింది. ఈ దాడిలో 40 మంది పౌరులు చనిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో అప్ఘాన్‌లో ఒక్కసారిగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఖోస్త్‌లో వేల సంఖ్యలో ప్రజలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.
అటు తాలిబన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ తీరుపై మండిపడింది. అప్ఘానీల సహనాన్ని పరీక్షించొద్దని అప్ఘానిస్తాన్ మంత్రి జబీబుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు. పాక్ వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అప్ఘానిస్తాన్‌లోని పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని సమన్లు జారీ చేసి తాలిబన్ ప్రభుత్వం నిరసన వ్యక్తంచేసింది.

Also read : Imran Khan: ఆట మార్చేశాడు.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇమ్రాన్ తంటాలు

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయిన కొన్నిరోజులకే అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. రెండు దేశాల మధ్య డ్యురాండ్ రేఖగా పిలిచే 2వేల700 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ డ్యురాండ్ లైన్‌కు దగ్గరగా ఉన్న నాలుగు గ్రామాల్లో పాకిస్తాన్ హెలికాప్టర్లు బాంబుదాడులు జరిపాయని ఆప్ఘాన్ తెలిపింది. అయితే ఆప్గాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు తమపై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. జనవరి నుంచి ఇలా జరిగిన దాడుల్లో 128 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని తెలిపింది.

Also read : భారత బోర్డర్‌ సమీపంలో చైనా మొబైల్ టవర్లు!

పాకిస్తాన్ తాజాగా జరిపిన దాడులతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు వస్తాయని గతంలోనే అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు. పాకిస్తాన్ తాలిబన్ల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలున్నాయి. అప్ఘానిస్తాన్‌లో తాలిబన్లకు మద్దతిచ్చే పాకిస్తాన్ తమ దేశంలోని తాలిబన్లను మాత్రం వ్యతిరేకిస్తోంది. కాబూల్‌ను ఆక్రమించుకున్న వెంటనే తమ జైళ్లలోని పాకిస్తాన్ తాలిబన్లను అప్ఘాన్ తాలిబన్లు విడుదల చేశారు. ఇది రెండు దేశాల మధ్య విభేదాలకు కారణమవుతుందన్న ఆందోళన అప్పుడే వ్యక్తమయింది. ఊహించినట్టే ఇప్పుడు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు అప్ఘానిస్తాన్ భూభాగాన్ని వేదికగా చేసుకుని తమపై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంటే..వైమానిక దాడులతో పాకిస్తాన్ తమ సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని అప్ఘాన్ మండిపడుతోంది.