Pakistan: నా పేరు ఖాన్, నేను దేశద్రోహిని కాను.. మే 9నాటి అశాంతిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పందన
దీని మీద లైవ్ టీవీలో విచారణ కోరుతున్నాను. దీంతో ఏమి జరిగిందో దేశానికి చెప్పే అవకాశం నాకు మరింత సులువుగా దొరుకుతుంది. నేను ఎలా ద్రోహం చేశాను? నేను ఏం అబద్ధం చెప్పాను? పాకిస్తాన్ భవిష్యత్తు నిర్ణయాలు దుబాయ్‌లోని అవినీతిపరులు తీసుకుంటున్నారు

Imran Khan: తనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మే 9న జరిగిన నిరసనలో అశాంతికి కారణమైన వారిపై బహిరంగ విచారణ జరపాలని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మంగళవారం పాకిస్తాన్ ఆర్మీకి సవాలు విసిరారు. తన పేరు ఖాన్ అని, అయితే తను దేశద్రోహిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం డీసీ ఐఎస్పీఆర్ స్పందిస్తూ నిరసన చేసిన వారు దేశద్రోహులు అంటూ వ్యాఖ్యానించడంపై ఇమ్రాన్ పై విధంగా స్పందించారు.
పోలీసు కస్టడీలో చాలా మంది పీటీఐ కార్యకర్తలు ఉన్నారు. అయితే వారిపై క్రూరమైన ఆర్మీ చట్టం ప్రయోగించడంపై ఇమ్రాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాన్ని ఉద్దేశిస్తూ “మేము దేశద్రోహులమని డీసీ ఐఎస్పీఆర్ నిన్న అన్నారు. దేశంపై తిరుగుబాటు చేయడం చాలా పెద్ద నేరం. మీ వద్ద ఉన్న సాక్ష్యాలను తీసుకురండి. మేము మా సాక్ష్యాలను తీసుకువస్తాము. దీనిపై బహిరంగ విచారణ చేద్దాం” అని ఇమ్రాన్ అన్నారు.
Karnataka Politics: సిద్ధరామయ్య భయపడ్డారు, నేనలా కాదు.. డిప్యూటీ సీఎం డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
“దీని మీద లైవ్ టీవీలో విచారణ కోరుతున్నాను. దీంతో ఏమి జరిగిందో దేశానికి చెప్పే అవకాశం నాకు మరింత సులువుగా దొరుకుతుంది. నేను ఎలా ద్రోహం చేశాను? నేను ఏం అబద్ధం చెప్పాను? పాకిస్తాన్ భవిష్యత్తు నిర్ణయాలు దుబాయ్‌లోని అవినీతిపరులు తీసుకుంటున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ మీరు ఇలాంటిది చూడలేరు’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ మధ్య దుబాయ్‌లో జరుగుతున్న సమావేశాన్ని ఖాన్ ప్రస్తావిస్తూ ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల కోసం రెండు పార్టీలు ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నాయని అన్నారు.
Quran Burning: మసీదు ముందే ఖురాన్‌ను కాల్చేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీలు దోపిడీదారులని ఇమ్రాన్ విమర్శించారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తనను విశ్వసించిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘‘పాకిస్తాన్లో ఆటవిక చట్టం కొనసాగుతోంది. జర్దారీ, నవాజ్ లాంటి దొంగలు దుబాయ్‌లో కూర్చున్న పాకిస్తానీల భవితవ్యాన్ని నిర్ణయించలేరు’’ అని ఇమ్రాన్ అన్నారు. “నా పేరు ఖాన్. నేను దేశద్రోహిని కాదు. జీవితాంతం నేను పాకిస్తాన్‌కు సేవ చేశాను” అని ఖాన్ అన్నారు. తన పై ఆరోపణల గురంచి ఇమ్రాన్ స్పందిస్తూ ఆధారాలుంటే నిరూపించండి, లేకుంటే క్షమాపణ చెప్పండని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.