Versova-Bandra Sea Link: ముంబైలోని వెర్సోవా-బాంద్రా సీ లింక్‭కు వీర్ సావర్కర్ సేతుగా పేరు మార్చిన షిండే సర్కార్

వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు" అని అన్నారు

Versova-Bandra Sea Link: ముంబైలోని వెర్సోవా-బాంద్రా సీ లింక్‭కు వీర్ సావర్కర్ సేతుగా పేరు మార్చిన షిండే సర్కార్

Maharashtra Politics: ఏక్‭నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం హిందుత్వవాదాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వెర్సోనా-బాంద్రా మధ్య సముద్రంపై నిర్మిస్తున్న వంతెనకు హిందుత్వ సిద్ధాంతకర్తగా చెప్పుకునే వీర్ సావర్కర్ పేరును పెట్టాలని మహారాష్ట్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. వాస్తవానికి సావర్కర్ 140 జయంతి సందర్భంగా మే 28నే సీఎం షిండే ఈ ప్రకటన చేసినప్పటికీ.. నేటితో దానికి అధికారిక ఆమోదం లభించింది.

Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

ఇక ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‭కి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతి న్హవ శేవ అటల్ సేతు అని పేరు పెట్టనున్నట్లు కూడా తాజాగా మంత్రివర్గం నిర్ణయం వెలువడింది. తీరప్రాంత రహదారి ప్రాజెక్టులో భాగమైన 17 కిలోమీటర్ల వెర్సోవా-బాంద్రా సముద్రం లింక్.. అంధేరిని, బాంద్రా-వోర్లీ సముద్రం లింక్‌కు కలుపుతుంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింకేమో ముంబై, నవీ ముంబైలను కలుపుతుంది. ఈ రెండింటి నిర్మాణం ఈ యేడాది డిసెంబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉంది.

Karnataka Politics: సిద్ధారామయ్య భయపడ్డారు, నేనలా కాదు.. డిప్యూటీ సీఎం డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ “నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు” అని అన్నారు. సావర్కర్ వివాదానికి ఇది ప్రధాన కారణమైంది. ఇకపోతే.. కొద్ది రోజుల క్రితం పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అక్కడి సిద్ధరామయ్య ప్రభుత్వం అక్కడి పాఠ్యా పుస్తకాల్లో నుంచి వీర్ సావర్కర్, ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్‌పై పాఠాలను తొలగించింది. ఈ సందర్భంలో ముంబైలోని వంతెనకు సావర్కర్ పేరు పెట్టడం మరింత చర్చనీయాంశమైంది.