Al Qaeda Chief: ప్యాకేజీ కోసం ఆచూకీ ఇచ్చిన పాక్? అల్ జవహరీని హతమార్చిన అగ్రరాజ్యం

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీని అగ్రరాజ్యం మట్టుపెట్టింది. డ్రోన్ దాడి సహయాంతో చుట్టుపక్కల వారికి ప్రమాదం లేకుండా జవహరీని అమెరికా హతమార్చింది. అయితే జవహరీని అమెరికా హతమార్చడంలో పాకిస్థాన్ సహకారం ఉందనే వాదన వినిపిస్తోంది.

Al Qaeda Chief: ప్యాకేజీ కోసం ఆచూకీ ఇచ్చిన పాక్? అల్ జవహరీని హతమార్చిన అగ్రరాజ్యం

Al Qaeda Chief: అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీని అగ్రరాజ్యం మట్టుపెట్టింది. డ్రోన్ దాడి సహయాంతో చుట్టుపక్కల వారికి ప్రమాదం లేకుండా జవహరీని అమెరికా హతమార్చింది. అయితే జవహరీని అమెరికా హతమార్చడంలో పాకిస్థాన్ సహకారం ఉందనే వాదన వినిపిస్తోంది. పాక్ ఇచ్చిన సమాచారంతోనే జవహరీని అగ్రరాజ్యం డ్రోన్ దాడితో అమెరికా దళాలు హతమార్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే పాక్ ఇలా చేయడానికి పలు కారణాలు ఉన్నాయట.

Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. మట్టుపెట్టిన అమెరికా

ముఖ్యంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, దివాళా నుంచి రక్షించుకోవడానికి ఆ దేశం అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు స్నేహపూరిత దేశాల నుంచీ ఆర్థిక సహకారాన్ని కోరుతోంది. సౌదీ అరేబియా, అరబ్‌ ఎమిరేట్స్‌ను సాయంకోసం అభ్యర్థిస్తోంది. అంతర్జాతీయ దవ్ర్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్యాకేజీ కోసం పాక్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అగ్రరాజ్యాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆల్ ఖైదా చీఫ్ సమాచారాన్ని సీఐఏకు పాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Saif al-Adel: సైఫ్ అల్ అదేల్ ఎవరు? అల్‌ఖైదా నెక్ట్స్ చీఫ్ అతనేనా?

అల్ ఖైదా చీఫ్ జవహరీ ఈ ఏడాది ఆరంభం వరకు పాకిస్థాన్ లోనే ఉన్నాడు. ఆ తరువాత పాక్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు మకాం మార్చాడు. ఆల్ ఖైదా చీఫ్ కదలికలు పూర్తిగా తెలిసిన పాకిస్థాన్ అతని సమాచారాన్ని మొత్తాన్ని అగ్రరాజ్యంకు ఉప్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జవహరీకి ఇంటి బాల్కనీలో నిల్చొనే అలవాటు ఉందని, దాడి సమయంలో అక్కడ ఉన్నది ఖచ్చితంగా అతడేనని తేల్చిచెప్పడంలో పాక్ హస్తం ఉందని భావిస్తున్నారు.