China Tour: చైనా పర్యటనకు పాక్ ప్రధాని.. వ్యూహాత్మక సహకారం ఇదరు దేశాల ఎజెండా!

పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం, రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేసినా డబ్బులు అడుగుతారని అనుకుంటున్నారని, ప్రపంచం ముందు పాకిస్తాన్ బిచ్చగాడిలా నిల్చోందని అన్నారు

China Tour: చైనా పర్యటనకు పాక్ ప్రధాని.. వ్యూహాత్మక సహకారం ఇదరు దేశాల ఎజెండా!

Pakistan PM Shehbaz Sharif 's 1st visit to China next week

China Tour: ఈ ఏడాది ఏప్రిల్‭లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్.. ప్రధాని హోదాలో మొదటిసారి చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‭ను ఆయన కలుసుకోనున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాంగిచడం, ప్రాంతీయ, ప్రపంచ పరిణామలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. షరీఫ్ పర్యటన చైనాలో రెండు రోజుల పాటు కొనసాగుతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం, రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేసినా డబ్బులు అడుగుతారని అనుకుంటున్నారని, ప్రపంచం ముందు పాకిస్తాన్ బిచ్చగాడిలా నిల్చోందని అన్నారు. ఈ తరుణంలో చైనా పర్యటన చాలా ఆసక్తిని రేపుతోంది.

నవంబర్ 1,2 తేదీల్లో పర్యటించనున్న షెహబాజ్ వెంట ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంటుంది. చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు షెహనాజ్ ఆదేశంలో పర్యటించున్నట్టు పాక్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే చైనా నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ 20వ సమావేశం ముగియడం, ఈ సమావేశంలో మరో ఐదేళ్లపాటు జిన్‌పింగ్‌కే అధికారం కట్టబెట్టడం వంటి పరిణామాల తర్వాత చైనాలో పర్యటించనున్న తొలి నాయకుడు షెహనాజ్ కానుండటం విశేషం.

Mayawati: మదర్సాల్లోని విద్యార్థులను డ్రైవర్లను, మెకానిక్‭లను చేసింది కాంగ్రెసే.. మండిపడ్డ మాయావతి