Pakistan: చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం మిలిటరీ మద్దతు కోరిన ఇమ్రాన్ ఖాన్!
ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ చేసిన ఆరోపణలను పీటీఐ నేత అసద్ ఉమర్ ఖండించారు. ఇమ్రాన్ అలాంటి అభ్యర్థనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో మిలిటరీ అత్యంత శక్తివంతమైన సంస్థ. గత ఏడు దశాబ్దాల్లో 25 ఏళ్ల పాటు దేశాన్ని సైన్యం నేరుగా పాలించింది. ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలిస్తున్నప్పటికీ.. భద్రత, విదేశీ పాలసీల విషయంలో ఇప్పటికీ సైన్యానిదే పైచేయిగా ఉంది

Pak's Powerful ISI Is In All-Out War With Imran Khan
Pakistan: చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాల కోసం పాకిస్తాన్లో శక్తివంతమైన మిలిటరీ సహాయాన్ని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కోరారని పాకిస్తాన్ ఇంటలీజెన్స్ చీఫ్ గురువారం ఆరోపించారు. పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటలీజెన్స్ (ఐఎస్ఐ) లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ నెలలో విపక్షాలు ఏకమై ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించే ముందు మిలిటరీ సహాయం కోసం ఆయన తరుచూ అభ్యర్థించారని అయితే ఆయన అభ్యర్థన తిరస్కరించబడిందని అంజుమ్ పేర్కొన్నారు.
Electric Shock Three Died : పురుగుల మందు పిచికారి చేస్తుండగా.. కరెంట్ షాక్ తో ముగ్గురు రైతులు మృతి
గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే రాజకీయాల్లో తలదూర్చడం వంటి విషయాల్లో కొన్ని తప్పిదాలు జరిగినట్లు అంజుమ్ ఒప్పుకున్నారు. అయితే తాము రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఐఎస్ఐ చీఫ్ అత్యంత సన్నిహితంగా మెలిగే వారని, అయితే వీరి మధ్య అంతరం పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. ఖాన్ వెనుక మిలిటరీ ఉందనే ఆరోపణలను ఇరు నేతలు అప్పట్లో సున్నితంగా తోసి పుచ్చారు.
Chirag Paswan: బీజేపీతోనే చిరాగ్ పాశ్వాన్, ప్రచారం కూడా చేస్తారు.. బిహార్ బీజేపీ చీఫ్
కాగా, ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ చేసిన ఆరోపణలను పీటీఐ నేత అసద్ ఉమర్ ఖండించారు. ఇమ్రాన్ అలాంటి అభ్యర్థనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో మిలిటరీ అత్యంత శక్తివంతమైన సంస్థ. గత ఏడు దశాబ్దాల్లో 25 ఏళ్ల పాటు దేశాన్ని సైన్యం నేరుగా పాలించింది. ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలిస్తున్నప్పటికీ.. భద్రత, విదేశీ పాలసీల విషయంలో ఇప్పటికీ సైన్యానిదే పైచేయిగా ఉంది. ఇకపోతే, ఏప్రిల్‌లో పాకిస్తాన్ పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఓడిపోయి ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయారు.
Rishi Sunak With Modi: ప్రధాని మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రషి సునాక్ భేటీ ఖరారు.. ఎప్పుడంటే?
ఇక అప్పటి నుంచి ముందస్తు ఎన్నికలు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు లాహోర్ నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వరకు యాత్ర చేపట్టారు. వారం రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఖాన్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబరులో నిర్వహిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
Memes on Parag: పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్.. మీమ్స్‌తో నెటిజెన్ల హల్చల్