Rishi Sunak With Modi: ప్ర‌ధాని మోదీతో బ్రిట‌న్ నూత‌న ప్ర‌ధాని ర‌షి సునాక్ భేటీ ఖ‌రారు.. ఎప్పుడంటే?

బ‌్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ త్వ‌ర‌లో భార‌త ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేర‌కు వేదిక ఖ‌రారైంది. వీరిద్ద‌రూ ఇండోనేషియాలోని బాలి న‌గ‌రంలో జ‌ర‌గ‌నున్న జీ-20 స‌మావేశం సంద‌ర్భంగా భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Rishi Sunak With Modi: ప్ర‌ధాని మోదీతో బ్రిట‌న్ నూత‌న ప్ర‌ధాని ర‌షి సునాక్ భేటీ ఖ‌రారు.. ఎప్పుడంటే?

PM modi

Rishi Sunak With Modi: బ‌్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ త్వ‌ర‌లో భార‌త ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేర‌కు వేదిక ఖ‌రారైంది. వీరిద్ద‌రూ ఇండోనేషియాలోని బాలి న‌గ‌రంలో న‌వంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌నున్న జీ-20 స‌మావేశం సంద‌ర్భంగా భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌య‌మైన 10-డౌనింగ్ స్ట్రీట్ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

UK PM Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ వల్ల భారత్‌కు మేలు జరుగుతుందా?

గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ దేశాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతం తెలిపారు. ఇండోనేషియాలో జరిగే టీ20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతార‌ని ప్రకటనలో పేర్కొంది. ఇటీవ‌ల బ్రిట‌న్ ప్ర‌ధానిగా రిషి సునాక్ ఏక‌గ్రీవంగా ఎంపికైన విష‌యం విధిత‌మే. ప్ర‌ధానిగా సునాక్ బాధ్య‌త‌లు సైతం స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా గురువారం భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ లో రుషి సునాక్ కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సందర్భంగా మోదీ ఇరుదేశాల మధ్య ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ (FTA) అంశాన్ని రిషి సునాక్ దృష్టికి తీసుకెళ్లారు. పరస్పర సంభాషణ అనంతరం ఇరువురూ ట్విటర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఒప్పందం దీపావళి నాటికల్లా పూర్తవుతుందని అంతా భావించారు. కానీ బ్రిటన్‌లో అస్థిర ప్రభుత్వం కారణంగా ముందుకు కదల్లేదు.