UK PM Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ వల్ల భారత్‌కు మేలు జరుగుతుందా?

భారత మూలాలున్న ఓ హిందూ బ్రిటన్ పీఎం అయ్యాడు. భారత్ మొత్తం దీనిని సెలబ్రేట్ చేసుకుంటోంది. రిషి సునక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కాబట్టి.. వంద శాతం ఆ దేశం కోసమే పనిచేస్తారు. అదే విషయం చెప్పారు కూడా. అతను తీసుకునే నిర్ణయాల్లో.. ఒకటి, రెండైనా భారత్‌కు మేలు చేసేలా ఉంటాయా? ఇండియా-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు కృషి చేస్తారా? అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

UK PM Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ వల్ల భారత్‌కు మేలు జరుగుతుందా?

UK PM Rishi Sunak : భారత మూలాలున్న ఓ హిందూ బ్రిటన్ పీఎం అయ్యాడు. భారత్ మొత్తం దీనిని సెలబ్రేట్ చేసుకుంటోంది. రిషి సునక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కాబట్టి.. వంద శాతం ఆ దేశం కోసమే పనిచేస్తారు. అదే విషయం చెప్పారు కూడా. అతను తీసుకునే నిర్ణయాల్లో.. ఒకటి, రెండైనా భారత్‌కు మేలు చేసేలా ఉంటాయా? ఇండియా-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు కృషి చేస్తారా? అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

భారత సంతతికి చెందిన 42 ఏళ్ల రిషి సునక్.. బ్రిటీష్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించారు. అతను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవడంతో దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ హిందూ.. యూకే పాలనా పగ్గాలు చేపట్టాడని అంతా సంబరపడిపోతున్నారు. అయితే.. బ్రిటీషర్లలోనే కాదు భారతీయుల్లోనూ.. కొత్త ప్రధానిగా రిషి సునక్ ఏం చేయబోతున్నారు? ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్‌ను ఎలా గట్టెక్కిస్తారు? మళ్లీ యూకేని టాప్‌లో నిలబెడతారా? లేదా? అన్నదానిపై.. గ్లోబ్ వైడ్ పెద్ద చర్చే నడుస్తోంది. అయితే.. చాలా మంది భారతీయుల్లో మాత్రం.. ఇందుకు భిన్నమైన డిస్కషన్ జరుగుతోంది. భారత మూలాలున్న రిషి సునక్.. బ్రిటన్ పీఎంగా ఎన్నికవడంతో భారత్‌కు మేలు జరుగుతుందని మెజారిటీ ఇండియన్స్ నమ్ముతున్నారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయ్.

Rishi Sunak Cars : రిషి సునాక్ గ్యారేజిలో ఖరీదైన కార్లు .. శక్తివంతమైన పేలుడును కూడా తట్టుకోగల స్ట్రాంగెస్ట్ కారు

గత ఆగస్టులో రిషి సునక్ పీఎం రేసులో ఉన్నప్పుడు.. నార్త్ లండన్‌‌ నుంచే తన క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా.. బ్రిటీష్ ఇండియన్లు పాల్గొన్న సమావేశంలో సంప్రదాయ వందనం చేస్తూ.. తన ప్రచారాన్ని ప్రారంభించారు. మధ్యలో హిందీలోనూ మాట్లాడారు. తాను గనక బ్రిటన్ ప్రధాని అయితే.. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయటానికి పనిచేస్తానని చెప్పారు. అంతేకాదు.. రిషి సునక్ బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడిగా భగవద్గీత మీద ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన ఓ సంప్రదాయ కార్యక్రమంలోనూ.. రిషి గోమాతను పూజించారు. తాజాగా డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో.. దీపాలు వెలిగించి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇండియాలో.. ఓ మతంలా మారిన క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా చెబుతుంటారు. వీటన్నింటికి మించి.. రిషి సునక్ మన సాఫ్ట్ వేర్ దిగ్గజం.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి అల్లుడు. ఇది కూడా.. రిషిని ఇండియాకు మరింత దగ్గర చేసింది. వీటన్నింటి కారణంగా.. కొద్దిరోజులుగా యూకే పాలిటిక్స్‌ని గమనిస్తున్న భారతీయులంతా.. రిషి ఇండియాకు తప్పకుండా మేలు చేస్తారని నమ్ముతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

నిజానికి.. సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా ఎంపికైనప్పుడు, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా భారతీయులు ఇలాగే సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ల సక్సెస్‌ని.. మొత్తం భారత్ సాధించిన విజయంగా చూస్తారు. విదేశీ గడ్డపై మన వాళ్లు సాధించే విజయాన్ని ఎంతో గర్వకారణంగా ఫీలవుతుంటారు. అయితే.. బ్రిటన్‌లోని కన్జర్వేటివ్ పార్టీలో భారత సంతతికి చెందిన రాజకీయవేత్తలు చాలా మంది ఉన్నారు. అందులో.. టోరీలకు బలమున్న సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ.. రిషి సునక్‌తో పోలిస్తే.. వారికి ఉన్న పాపులారిటీ, ఆదరణ తక్కువే. ఇప్పుడు.. రిషి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవడం కచ్చితంగా చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే.. పాలించడం మాకు మాత్రమే వచ్చనుకునేవాళ్లకు, వలస పాలన చరిత్ర ఉన్న దేశానికి, ఇప్పటికీ జాతి వివక్ష పట్టిపీడిస్తున్న సమాజానికి.. ఒక నాన్ వైట్ పీఎంగా ఎన్నికవడమంటే అదో చరిత్రే.

Leaders of Indian Origin in the World : ప్రపంచ దేశ రాజకీయాలను శాసిస్తున్న మన భారతీయులు .. పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులదే కీ రోల్..

గత ఆగస్టులో రిషి సునక్ పీఎం రేసులో ఉన్నప్పుడు.. అతని విషయంలో ఇండియన్ సోషల్ మీడియాలో కొంత నెగటివ్ ప్రచారం జరిగింది. అక్కడ ఆయన ప్రధాని కావడం పట్ల.. ఇక్కడ ఇండియాలో సంబరాలు చేసుకోవడం నవ్వు తెప్పిస్తోందన్నట్లుగా కొందరు రియాక్ట్ అయ్యారు. కానీ.. 2 నెలలు గడిచేసరికి సీన్ మొత్తం మారిపోయింది. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి గెలవడాన్ని.. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది. అతను.. భారత్ – బ్రిటన్ మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడేలా కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.

రిషి సునక్ భారత్‌లో ఉన్న తన మూలాలను మరువకున్నా.. తన తొలి ప్రాధాన్యత మాత్రం బ్రిటన్ అన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నారు. అతని మాటలు.. చేదు నిజాన్ని దాచే.. తీపి కోటింగ్‌ మాదిరిగా ఉన్నాయ్. భారత్ పట్ల కాస్త సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. రిషి చేతలు మాత్రం పక్కా బ్రిటీషర్ మాదిరిగానే ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. పైగా.. బ్రిటన్ పార్లమెంటులో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు.. రిషి సునక్ చేసిన ప్రసంగాల్లో ఎప్పుడూ భారత్‌తో బలమైన సంబంధాల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. పైగా.. బ్రిటన్ ఆర్థికమంత్రిగా వ్యవహరించినప్పుడు కూడా.. భారత్‌లో ఎన్నడూ అధికారికంగా పర్యటించలేదు. కానీ.. ఇప్పుడు బ్రిటన్ పీఎం ఆయనే గనక.. భారత్ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.