Plant Based Covid Vaccine : మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం..త్వరలోనే అందుబాటులోకి
మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం పలికింది. ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని పరిశోధకులు తెలిపారు.

Medicago Plant Based Covid 19 Vaccine Approved By Health Canada
Medicagos Two-Dose Vaccine Can Be Given To Adults: ఇప్పటికే కోవిడ్ నియంత్రించే వ్యాక్సిన్లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. కానీ మరిన్ని రకాల వ్యాక్సిన్ల కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతు ఉన్నాయి. మొక్కల నుంచి కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ ఇవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయోనని అనుకున్నాం. ఈక్రమంలో మొక్కల ఆధారంగా వ్యాక్సిన్ తయారు చేయటం దానికి కెనడా ఆమోదం పలకటం కూడా జరిగింది. ఈ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురావటానికి యత్నాలు జరుగుతున్నాయి. మరి కోవిడ్ వ్యాక్సిన మొక్క ఏంటీ? దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం..
Also read : Covid Tablet in Hyd: కరోనాను ఖతం చేసే టాబ్లెట్..భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే..ధర ఎంతంటే..
మెడికాగో అనే మొక్క ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను 18 నుంచి 64 ఏళ్ల పెద్దలకు ఇవ్వవచ్చని కెనడియన్ అధికారులు తెలిపారు. కానీ ఈ వ్యాక్సిన్ 65 ఏళ్లు పైన వారికి ఇవ్వవచ్చా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు పరిశోధకులు. ఈ వ్యాక్సిన్ రూపొందించాక పెద్ద వయస్సు వారిపై ప్రయోగించి చూశారు. 24 వేల మందిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు పరిశోధకులు. కోవిడ్ -19 నిరోధించడంలో ఇది ఎంతగా పనిచేస్తుందీ అంటూ 71% ప్రభావంతంగా ఉందని తెలిపారు పరిశోధకులు.
మెడికాగో అనే మొక్క వైరస్ లాంటి కణాలను పెంచడంలో సజీవ కర్మాగారాలుగా పనిచేస్తుంది. ఇది కరోనా వైరస్‌ను కప్పి ఉంచే స్పైక్ ప్రోటీన్‌ను అనుకరిస్తుంది. మొక్కల ఆకుల నుండి కణాలు తొలగించి శుద్ధి చేస్తారు. ఇది బ్రిటీష్ భాగస్వామి గ్లాక్సో స్మిత్‌క్లైన్ తయారు చేసిన అడ్జువాంట్‌గా పిలిచే రోగనిరోధక శక్తిని పెంచే మరొక వ్యాక్సిన్. మెడికాగో మొక్క ఆధారిత COVID-19 వ్యాక్సిన్ కెనడా ఆమోదించింది.
Also read : covid-19 AbhiSCoVac : అన్ని వేరియంట్లకూ ఒకే ఒక్క టీకాతో చెక్..
ప్రపంచవ్యాప్తంగా అనేక కోవిడ్-19 వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య అధికారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ల సరఫరాను పెంచాలనే ఉద్దేశంతో మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తున్నారు. క్యూబెక్ సిటీ-ఆధారిత మెడికాగో మెడికల్ ల్యాబ్ అనేక ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా మొక్కల ఆధారిత వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తోంది.