S.Jaishankar: చైనా సరిహద్దుల వద్దకు మోదీ సైనికులను పంపారు.. రాహుల్ కాదు: జైశంకర్

సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంటే ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్దకు సైన్యాన్ని పంపింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాదని, ప్రధాని మోదీ పంపారని అన్నారు.

S.Jaishankar: చైనా సరిహద్దుల వద్దకు మోదీ సైనికులను పంపారు.. రాహుల్ కాదు: జైశంకర్

S.Jaishankar: సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంటే ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్దకు సైన్యాన్ని పంపింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాదని, ప్రధాని మోదీ పంపారని అన్నారు.

అక్కడ చైనా సైన్యాన్ని మోహరిస్తుండడంతో పంపారని జైశంకర్ చెప్పారు. సరిహద్దుల వద్ద 1962లో ఏమైందనే విషయంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిజాయితీగా వ్యవహరించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల కోసం మోదీ ప్రభుత్వం బడ్జెట్ ను 5 రెట్లు పెంచిందని ఆయన చెప్పారు.

ప్యాంగోంగ్ సరస్సు వద్ద గత ఏడాది చైనా బిడ్జి నిర్మాణ ప్రయత్నాలు చేయడంతో దానిపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై జైశంకర్ స్పందిస్తూ… 1962 యుద్ధం నుంచి చైనా అక్రమ అధీనంలోనే ఆ ప్రాంతం ఉందని చెప్పారు. మొదటి సారి చైనా సైన్యం 1958లో అక్కడకు వచ్చిందని, 1962లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిందని తెలిపారు. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో చైనా బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తోందని అన్నారు. కాగా, చైనా అంశాన్ని విపక్ష పార్టీలు పార్లమెంటులోనూ లేవనెత్తుతున్న విషయం తెలిసిందే.

Javed Akhtar: ముంబై దాడుల సూత్రధారులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. పాకిస్తాన్‌లోనే విమర్శించిన జావేద్ అక్తర్