PM Modi Japan Visit : హిరోషిమాలో రెండోరోజు.. అణుదాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళి..

జీ7 దేశాల నాయకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ హిరోషిమాలోని అణుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.

PM Modi Japan Visit : హిరోషిమాలో రెండోరోజు.. అణుదాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళి..

PM Narendra Modi

Narendra Modi Japan Visit : ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. జీ7 సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన మోదీ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా జీ7 దేశాల సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతోనూ మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రష్యా, యుక్రెయిన్ మధ్య ఏడాదికిపైగా కొనసాగుతున్న యుద్ధ పరిష్కారానికి భారత్ కృషి చేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. రెండోరోజు (ఆదివారం) జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.

78ఏళ్ల క్రితం హిరోషిమాలో అణుబాంబు పడిన ప్రదేశానికి ప్రధాని మోదీ జీ7 దేశాల నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హిరోషిమా పీస్ మెమోరియల్ వద్ద అటామ్ బాంబ్ దాడిలో మరణించిన వ్యక్తులకు నివాళులర్పించారు. ఆ తరువాత పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని కూడా మోదీ సందర్శించారు. అక్కడ డాక్యుమెంట్ చేయబడిన ఎగ్జిబిట్ లను పరిశీలించి, సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. ప్రధాని మోదీతో పాటు పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించిన వారిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఇతర నేతలు ఉన్నారు.

రెండోరోజు హిరోషిమాలో ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్ ను కలుస్తారు. ఆ తర్వాత భారతదేశ పసిఫిక్ దీవుల సహకార సదస్సులో పాల్గొనడానికి పాపువా న్యూ గినియాకు మోదీ బయలుదేరి వెళ్తారు. ఇదిలాఉంటే శనివారం యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి చేశారు. యుక్రెయిన్ దేశాన్ని సందర్శించాలని ఆయన కోరారు.