UK : కరోనా టీకా ధృవపత్రంపై ఇండియా – బ్రిటన్ వార్

కొవిషీల్డ్ టీకా విషయంలో బ్రిటన్ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని చెబుతూనే...సర్టిఫికేట్ తోనే సమస్య ఉందని చెబుతోంది.

UK : కరోనా టీకా ధృవపత్రంపై ఇండియా – బ్రిటన్ వార్

India And Uk

Covishield Certificate : కొవిషీల్డ్ టీకా విషయంలో బ్రిటన్ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని చెబుతూనే…సర్టిఫికేట్ తోనే సమస్య ఉందని చెబుతోంది. టీకా ధృవీకరణ పత్రాలకు సరియైన ప్రమాణాలు ఉండాలని యూకే ప్రభుత్వం తిరకాసు పెట్టింది. కరోనా విషయంలో పలు దేశాలు వ్యాక్సిన్ తయారు చేసిన సంగతి తెలిసిందే. వీటికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. కానీ..టీకాలకు సంబంధించి 18 దేశాలతో రూపొందించిన జాబితాలో మాత్రం భారత్ ను ఇప్పటికీ చేర్చకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా..అక్కడకు వెళ్లే భారతీయులు 10 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది.

Read More : Covid-19 vaccine : నా భార్యకు టీకా ఇస్తావా అంటూ నర్సు మొహం పగలగొట్టిన వ్యక్తి

టీకా సర్టిఫికేట్లు  : –
ఈ గందరగోళ పరిస్థితికి చెక్ పడకముందే….తాజాగా మరొక ప్రకటన జారీ చేసింది. ప్రజల ఆరోగ్య దృష్టిలో ఉంచుకుని..తమ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, దేశాలు జారీ చేసే టీకా సర్టిఫికేట్లు కనీస ప్రమాణాలు కలిగి ఉండాలని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలపై భారత్ తో సహా అంతర్జాతీయ భాగస్వాముల దశల వారీ విధానంలో కలిసి పనిచేయడం జరుగుతోందని వెల్లడించింది. అయితే..ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన కనీస ప్రమాణాలు ఏంటో మాత్రం ఆ దేశ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. టీకా సర్టిఫికేట్లపై కొవిడ్ యాప్, ఎన్ హెచ్ఎస్ యాప్ (NHS APP) రూపకర్తలతో చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్.

Read More : Samantha – Chaitanya : ఇద్దరి మధ్య ఏం జరిగింది..?

మోదీ కీలక వ్యాఖ్యలు : –
మరోవైపు.. టీకా ధ్రువపత్రంపై ఇండియా, బ్రిటన్‌ల మధ్య వార్‌ నడుస్తోన్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సరిఫ్టికెట్లను అన్ని దేశాలు పరస్పరం గుర్తించుకోవలన్నారు. అప్పుడే అంతర్జాతీయ ప్రయాణాలు ఈజీ అవుతాయన్నారు మోదీ. వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కొవిడ్‌ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదన్నారు మోదీ.

Read More : Manike Mage Hithe: బెంగాలీలో మార్మోగుతున్న ‘దీదీ’ ‘మా మాతి మనుష్‌ హితే’ పాట!

ప్రపంచం ఒకే కుటుంబం : –
ప్రపంచంలో ఇంకా చాలా మందికి టీకాలు అందించాల్సి ఉందన్నారు. వ్యాక్సినేషన్‌పై బైడెన్‌ చొరవను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ ఎప్పుడూ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుందన్నారు. చాలా దేశాలకు తక్కువ ఖర్చుతో కూడిన మెడిసన్స్‌ అందించామన్నారు. వైద్యపరికరాలు, పీపీఈ కిట్ల ఉత్పత్తిని పెంచినట్లు మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో జరుగుతుందన్నారు మోదీ. ఇప్పటివరకు 80 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశామన్నారు.