Covid Climate Disasters : రాబోయే 5-10 ఏళ్లలో కొవిడ్ కంటే.. ప్రపంచ మానవాళికి విపత్తులు పొంచి ఉన్నాయి

ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మాత్రమే పెద్ద సమస్యగా మారింది. కానీ, రాబోయే ఐదు నుంచి పదేళ్లలో కరోనావైరస్ కంటే అత్యంత ప్రమాదకర సమస్యలను ప్రపంచం ఎదుర్కొవాల్సి రావొచ్చునని ప్రఖ్యాత బ్రాడ్ కాస్టర్, సర్ డేవిడ్ అటెన్‌బరో హెచ్చరిస్తున్నారు.

Covid Climate Disasters : రాబోయే 5-10 ఏళ్లలో కొవిడ్ కంటే.. ప్రపంచ మానవాళికి విపత్తులు పొంచి ఉన్నాయి

Problems That Await In Next 5 10 Years Greater Than Covid David Attenborough

Covid than Climate Disasters : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మాత్రమే పెద్ద సమస్యగా మారింది. కానీ, రాబోయే ఐదు నుంచి పదేళ్లలో కరోనావైరస్ కంటే అత్యంత ప్రమాదకర సమస్యలను ప్రపంచం ఎదుర్కొవాల్సి రావొచ్చునని ప్రఖ్యాత బ్రాడ్ కాస్టర్, సర్ డేవిడ్ అటెన్‌బరో హెచ్చరిస్తున్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచం ఎదురుచూస్తున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయనని తెలిపారు.

నవంబర్ నెలలో గ్లాస్గోలో ఐక్యరాజ్యసమితి శీతోష్ణస్థితి మార్పు సమావేశం (COP26) జరగనుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లో ప్రపంచ నేతలంతా వాతావరణంలో మార్పులపై సరైన చర్యలు చేపటాల్సిన అవసరం ఉందని అటెన్‌బరో సూచించారు. ఈ సమావేశంలో ప్రపంచంలోని ప్రధాన సమస్యలపై అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని అటెన్ బరో అభిప్రాయపడ్డారు.

ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచడానికి 2015లో పారిస్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అప్పటినుంచి ఈ COP26 సదస్సు ఎంతో ముఖ్యమైన వాతావరణ శిఖరాగ్రంగా పేరుగాంచింది. ప్రపంచవ్యాప్త సమస్యలను పరిష్కరించాలంటే దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఎంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే 5-10 సంవత్సరాలలో మన కోసం ఎదురుచూస్తున్న సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నారు. COP26 లోని సమావేశాలు విజయవంతం చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. చివరికి ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రాణాంతక సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలు ఒకేతాటిపైకి రావాల్సిన సమయమని పేర్కొన్నారు.

యుఎన్ వాతావరణ మార్పుల శిఖరాగ్ర సమావేశానికి యుకె ప్రెసిడెన్సీకి COP26 పీపుల్స్ అడ్వకేట్‌గా అంగీకరించినందుకు బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ 95 ఏళ్ల డేవిడ్ అటెన్‌బరో‌కు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడానికి, భవిష్యత్ తరాల కోసం భూగ్రహాన్ని రక్షించడానికి అటెన్‌బరో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపించాడని జాన్సన్ అభినందించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన కేబినెట్ స్థాయి మంత్రి అలోక్ శర్మ COP26 అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. వాతావరణ మార్పు మానవాళి ఎదుర్కొంటున్న గొప్ప ముప్పు అని శర్మ అన్నారు.