Ukraine-Russia: యుక్రెయిన్ అధ్యక్షుడిని హతమార్చేందుకు 400 మంది కిరాయి సైనికులను పంపిన పుతిన్
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్స్కీని హతమార్చేందుకు పుతిన్ ఆదేశించినట్లు ది టైమ్స్ పత్రిక కధనంలో పేర్కొంది.

Ukraine
Ukraine-Russia: యుక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు సంకల్పించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..అసాధారణ రీతిలో తన స్వరూపాన్ని బయటపెడుతున్నాడు. యుక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు అడ్డుగా ఉన్న ఏ అంశాన్నయినా తొలగించుకునేందుకు ఎంతకైనా తెగించేందకు పుతిన్ సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈక్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్స్కీని హతమార్చేందుకు పుతిన్ ఆదేశించినట్లు ది టైమ్స్ పత్రిక కధనంలో పేర్కొంది. ఆ వివరాలు మేరకు ఆఫ్రికా నుండి 400 మందికి పైగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన రష్యన్ కిరాయి సైనికులను యుక్రెయిన్ కు తరలించినట్లు తెలిపింది. “వాగ్నర్ గ్రూప్” అని పిలువబడే ఒక ప్రైవేట్ మిలీషియా.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరియు మరో 23 మంది ప్రభుత్వ అధికారులను హతమార్చేందుకు సిద్దమైనట్లు టైమ్స్ కథనం వెల్లడించింది.
Also read: Russia-Ukraine : మండుతున్న చమురు ధరలు, భారత్ లో త్వరలో పెరిగే అవకాశం!
ఈ “వాగ్నర్ గ్రూప్” మిలీషియాను పుతిన్ అత్యంత సన్నిహితుడు నడుపుతున్నట్లు తెలిపింది. యుక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరిలోనే 2,000 ను౦డి 4,000 కిరాయి సైనికులు ఆఫ్రికా నుంచి యుక్రెయిన్ కు చేరుకున్నారు. వారిలో కొందరిని డొనెట్స్క్ మరియు లుహాన్స్క్ తూర్పు ప్రాంతాలకు పంపగా, 400 మందిని బెలారస్ మీదుగా కీవ్ నగరంలోకి పంపారు. వీరి టార్గెట్ లో జెలెన్స్కీతో పాటు, యుక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మైహాల్, కైవ్ మేయర్, మాజీ బాక్సింగ్ ఛాంపియన్ విటాలీ క్లిట్ష్కో వంటి 23 మంది ఇతర ప్రభుత్వ వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.
Also read: Russia Ukraine War : పుతిన్ మరో కఠినమైన నిర్ణయం.. రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు!
రష్యాతో శాంతి చర్చల నేపథ్యంలో ఈ కిరాయి గుండాలు వెనక్కు తగ్గారని, చర్చలకు లొంగని పక్షంలో వీరు తమ పని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. కాగా ఆదివారం జరిగిన శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడంతో.. బుధవారం నాడు మరోసారి రష్యా అధికారులతో జెలెన్స్కీ చర్చలు జరిపారు. ఈక్రమంలో కిరాయి గుండాల వ్యవహారం బయటకు రావడం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది.
Also read: Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్