Corona Detection App : కరోనా గుట్టువిప్పే యాప్‌..వాయిస్‌ను బ‌ట్టి కొవిడ్ సోకిందా? లేదా? చెప్పేస్తుంది

నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ పరిశోధకులు సరికొత్త యాప్‌ను రూపొందించారు. ఎలాంటి ఖ‌ర్చులేకుండా మ‌న వాయిస్‌ను బ‌ట్టి క‌రోనా గుట్టువిప్పే యాప్‌ను తయారు చేశారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో వాయిస్ ఆధారంగా ఇన్‌ఫెక్షన్‌ను ఖచ్చితంగా గుర్తించగల స్మార్ట్‌ఫోన్ యాప్‌ను అభివృద్ధి చేశారు.

Corona Detection App : కరోనా గుట్టువిప్పే యాప్‌..వాయిస్‌ను బ‌ట్టి కొవిడ్ సోకిందా? లేదా? చెప్పేస్తుంది

COVID-19 cases in India

Corona Detection App : నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ పరిశోధకులు సరికొత్త యాప్‌ను రూపొందించారు. ఎలాంటి ఖ‌ర్చులేకుండా మ‌న వాయిస్‌ను బ‌ట్టి క‌రోనా గుట్టువిప్పే యాప్‌ను తయారు చేశారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో వాయిస్ ఆధారంగా ఇన్‌ఫెక్షన్‌ను ఖచ్చితంగా గుర్తించగల స్మార్ట్‌ఫోన్ యాప్‌ను అభివృద్ధి చేశారు.

అనేక యాంటిజెన్ పరీక్షల కంటే ఈ యాప్ చాలా ఖచ్చితమైనదని, చౌకగా, త్వరగా ఉపయోగించడానికి సులభమైనదని పరిశోధకులు పేర్కొన్నారు. త‌క్కువ ఆదాయ దేశాల‌కు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్‌ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌లో ఈ యాప్‌ను ప్రద‌ర్శించారు.

Corona Phone Test : నొప్పి కలగకుండానే.. స్మార్ట్ ఫోన్‌తో కరోనా నిర్ధారణ

కోవిడ్ సోకిన వ్యక్తిలో మొద‌ట గొంతు ఇన్ఫెక్షన్‌కు గుర‌వుతుంది. గొంతులోని శ్వాస‌మార్గం, స్వర‌పేటిక‌లు ప్రభావిత‌మ‌వుతాయి. వాయిస్ చేంజ్ అవుతుంది. ఈ మార్పులను ఏఐ ఆధారిత యాప్‌ గుర్తిస్తుంది. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. మొత్తం 308 మంది కరోనా రోగుల గొంతుల‌ను ఇందులో పొందుప‌ర్చారు.

నోటితో మూడు నుంచి ఐదుసార్లు గ‌ట్టిగా శ్వాస తీసుకోవాలి..మూడు సార్లు ద‌గ్గాలి.. అనంత‌రం స్క్రీన్‌పైన క‌నిపించే చిన్న వ్యాక్యాన్ని చ‌ద‌వాలి. వీటిని రికార్డు చేసిన యాప్‌, అందులో రికార్డు అయిన కోవిడ్ రోగుల వాయిస్‌ల‌తో స‌రిపోలుస్తుంది. నిమిషాల్లో మీకు కొవిడ్ సోకిందా? లేదా? చెప్పేస్తుంది.