Russia : ‘ఆ ఆలోచన మానండి..లేదంటే ఉక్రెయిన్ కు పట్టిన గతే మీకూ పడుతుంది’..స్వీడన్, ఫిన్లాండ్ లకు రష్యా వార్నింగ్

నాటో కూటమిలో చేరాలనే ఆలోచన చేస్తే ఉక్రెయిన్ కు పట్టిన గతే మీకు పడుతుంది అంటూ రష్యా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది.

Russia : ‘ఆ ఆలోచన మానండి..లేదంటే ఉక్రెయిన్ కు పట్టిన గతే మీకూ పడుతుంది’..స్వీడన్, ఫిన్లాండ్ లకు రష్యా వార్నింగ్

Russia Warns Sweden And Finland

Russia warns Sweden and Finland : నాటో కూటమిలో చేరాలనే ఆలోచన చేస్తే ఉక్రెయిన్ కు పట్టిన గతే మీకు పడుతుంది అంటూ రష్యా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. నాటోలో చేరాలనే ఆలోచన మానుకోవాలని హితవు పలికింది రష్యా. లేదరంటే మీమీద కూడా యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు పుతిన్. నాటో కూటమిలో చేరే ఆలోచనను విరమించుకోవాలని… లేకపోతే ఉక్రెయిన్ కు పట్టిన గతి నాటో సభ్యత్వానికి ఇరు దేశాల్లో మద్దతు పెరుగుతుండడంతో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తాజా బుధవారం (ఏప్రిల్ 20,2022)వార్నింగ్ ఇచ్చారు.

Also read : Russia : రష్యాను టచ్ చేసి చూడు.. క్షిపణి ప్రయోగంతో పుతిన్ వార్నింగ్.. భూమిపై ఎక్కడైనా గురితప్పదు..!

బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలను హెచ్చరించినట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి స్పష్టంగా వివరించామని మారియా అన్నారు. రష్యా తీసుకోబోయే చర్యలపై వారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని… రష్యా గురించి ఆ రెండు దేశాలకు బాగా తెలుసని అన్నారు.

నాటోలో చేరే విషయమై ఫిన్లాండ్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. నాటో కూటమిలో చేరాలని ఆ దేశ ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి ఎక్కువైంది. దీంతో, కూటమిలో చేరే దిశగా ఫిన్లాండ్ అడుగులు వేస్తోంది.ఈ విషయాన్ని పసిగట్టిన రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాటో కూటమిలో చేరాలని స్వీడన్ దేశంలోని 57% జనాభా మద్దతును పలుకుతోంది. వ్యతిరేకించే వారి సంఖ్య మార్చిలో 24% ఉండగా ఇప్పుడు 21%కి తగ్గింది.

Also read : UK PM Boris Johnson : అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్