Saudi-Yemen : యెమన్ జైలుపై సౌదీ ఎయిర్ స్ట్రైక్.. వంద మందికి పైగా మృతి!
ఈసారి భారీగా ప్రాణనష్టం సంభవించింది.

Saudi Yemen
Saudi Yemen : యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. సౌదీ తాజాగా యెమన్‌లోని సాదా జైలుపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందారు. మరో 100 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Read This : WhatsApp : వాట్సాప్ వాడొద్దు, జూమ్‌తో జాగ్రత్త.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్
గాయపడిన వారిని చికిత్స కోసం యెమన్‌లోని ఇతర ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో పలువురు చిన్నారులు, ఆఫ్రికా వలసదారులు కూడా ఉన్నారు. కోస్టల్ సిటీ హొడేయిదాలో మరో ఎయిర్ స్ట్రైక్ జరిగింది. యెమన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన పరిస్థితి. స్థానిక జైలుపైనా దాడి జరిగినట్లు రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ప్రతినిధులు చెప్పారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై యెమన్ హౌతీ తిరుగుబాటుదారులు 2022, జనవరి 17న జరిపిన డ్రోన్ బాంబు దాడులతో పరిస్థితి హీటెక్కింది. ఈ బాంబ్ బ్లాస్ట్‌ల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు పౌరులు మృతి చెందారు. దీనికి కౌంటర్ గా కొద్ది గంటల్లోనే సౌదీ సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమన్ రాజధాని సనాపై జనవరి 18న వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. తాజాగా మరోసారి సౌదీ దాడులు జరిపింది. ఈసారి భారీగా ప్రాణనష్టం సంభవించింది.
Read This : Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!