Shanghai Cooperation Organisation: ఎస్‌సీవో సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సు.. ఉజ్బెకిస్థాన్‌కు నేడు మోదీ, జిన్ పింగ్, పుతిన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో నేటి నుంచి జరగనుంది. ఇందులో ప్రాంతీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ అంశాలు చర్చిస్తారు. షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలు ఉన్నాయి.

Shanghai Cooperation Organisation: ఎస్‌సీవో సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సు.. ఉజ్బెకిస్థాన్‌కు నేడు మోదీ, జిన్ పింగ్, పుతిన్

Shanghai Cooperation Organisation

Updated On : September 15, 2022 / 9:04 AM IST

Shanghai Cooperation Organisation: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో నేటి నుంచి జరగనుంది. ఇందులో ప్రాంతీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ అంశాలు చర్చిస్తారు. షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలు ఉన్నాయి.

చైనా, రష్యా, భారత్ తో పాటు కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకిస్థాన్‌లు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ఇందులో పాల్గొంటారు. ఆయన కూడా మోదీ, జిన్ పింగ్, పుతిన్ తో చర్చించే అవకాశం ఉంది. ఆయా దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత ప్రధాని మోదీ, తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ మధ్య చర్చలు జరుగుతాయని రష్యా ఇప్పటికే ప్రకటించింది. భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక స్థిరత్వంతో పాటు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనిపై భారత విదేశాంగ శాఖ నుంచి మాత్రం ప్రకటన రాలేదు. భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందా? అన్న విషయంపై స్పష్టత లేదు.

Taliban on Masood Azhar: మసూద్‌ అజర్‌ అఫ్గాన్‌లో ఉన్నాడంటూ పాక్ ప్రకటన.. స్పందించిన తాలిబన్లు