Currency Notes: ఇంటిగోడల్లో దొరికిన నోట్ల కట్టలు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓనర్‌కు షాక్.. అసలేం జరిగిందంటే!
స్పెయిన్‌కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి చూశాడు. ఆ పెట్టెల నిండా స్పెయిన్ కరెన్సీ ఉంది.

Currency Notes: పాత ఇంటి గోడల్లో అప్పుడప్పుడూ నగలు, నాణేలు, డబ్బులు దొరకడం సహజం. స్పెయిన్‌లో కూడా ఒక వ్యక్తికి ఇలాగే ఇంటి గోడల్లో భారీ ఎత్తున నగదు దొరికింది. అంత డబ్బు చూసి సంబరపడ్డాడు. అయితే, అతడి సంబరం ఎంతో కాలం నిలవలేదు.
స్పెయిన్‌కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి చూశాడు. ఆ పెట్టెల నిండా స్పెయిన్ కరెన్సీ ఉంది. వాటి విలువ మన కరెన్సీలో దాదాపు రూ.46 లక్షలపైనే ఉంటుంది. దీంతో ఆ డబ్బు చూసి టోనో తెగ సంబరపడిపోయాడు. అయితే, అవి కాస్త పాత నోట్లని అర్థమైంది. దీంతో వెంటనే వాటిని మార్చుకునేందుకు స్థానిక బ్యాంకుకు వెళ్లాడు. అయితే, అక్కడ బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ నోట్లు చెల్లవని చెప్పారు. వాటిని బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ 2002లోనే బ్యాన్ చేసిందని చెప్పారు.
దీంతో 45 లక్షలు దొరికాయనే అతడి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అయినాసరే పట్టు వదలకుండా ప్రయత్నించాడు. చివరకు ఎలాగోలా ఆ కరెన్సీ నోట్లలో కొన్నింటిని మార్చుకోగలిగాడు. అలా మొత్తం రూ.30 లక్షల వరకు మార్చుకున్నాడు. దీంతో తన ఇంటికి సంబంధించిన కొన్ని మరమ్మతులు చేపట్టాడు. ఇంటికి మరమ్మతులు చేస్తుండగా భారీ స్థాయిలో నగదు బయటపడ్డ విషయం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది.