SpiceJet: డ్రోన్ డెలివరీ సర్వీస్‌లను ప్రారంభించనున్న స్పైస్ జెట్

అతి త్వరలోనే స్పైస్ జెట్ డ్రోన్ డెలివరీ సర్వీసులను అమల్లోకి తీసుకురానుంది. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అజయ్ సింగ్ శనివారం SpiceXpress విషయాన్ని ప్రకటించారు.

SpiceJet: డ్రోన్ డెలివరీ సర్వీస్‌లను ప్రారంభించనున్న స్పైస్ జెట్

Spice Jet

SpiceJet: అతి త్వరలోనే స్పైస్ జెట్ డ్రోన్ డెలివరీ సర్వీసులను అమల్లోకి తీసుకురానుంది. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అజయ్ సింగ్ శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. SpiceXpress డ్రోన్ డెలివరీని ప్రారంభించి.. లాజిస్టిక్స్ ప్లాట్ ఫాంను విస్తరించాలని ప్లాన్ చేస్తుంది.

0-5 కేజీలు, 5-10 కేజీలు, 10-25కేజీలు పలు రకాల పేలోడ్స్ బట్టి.. డ్రోన్లను ఉపయోగిస్తారు. ముందుగా డ్రోన్ డెలివరీ సర్వీసులను ప్రారంభించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. SpiceXpress సర్వీసులను వ్యాక్సిన్లు డెలివరీ చేసేందుకు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ సరఫరా కోసం, అత్యవసరమైన వస్తువులు పంపిణీ చేయడం కోసం వాడుతుంటారు.

ఈ డ్రోన్ వ్యాపారాన్ని 10జిల్లాల్లో 150 లొకేషన్లలో ఆరంభించి నెలకు 25వేల డెలివరీలు పూర్తి చేయగలగాలని ప్లాన్ చేస్తున్నారు.

………………………………: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?