Suicide Bombing At Istanbul: ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. ఆరుగురు మృతి.. 80 మందికిపైగా గాయాలు

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్ ఎవెన్యూలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు పెట్టారు.

Suicide Bombing At Istanbul: ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. ఆరుగురు మృతి.. 80 మందికిపైగా గాయాలు

Suicide Bombing At Istanbul

Suicide Bombing At Istanbul: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్ ఎవెన్యూలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు పెట్టారు. స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా.. 80 మందికిపైగా గాయాల పాలయ్యారు.

Man Dies While Dancing : షాకింగ్.. పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ అలీయెర్లికాయ ట్వీట్ చేశారు. ఇస్తాంబుల్ లో ఈ మార్కెట్ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి వస్తువులు పేలుడుదాటికి గాల్లో ఎగిరి చిందరవందరగా పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు చూసేందుకు భయానకరంగా ఉన్నాయి.

ఈ ఘటనను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. ఇస్తాంబుల్లో ఘటన నీచమైన దాడి అన్నారు. ఈ దాడి వెనుక నేరస్తులను కనుగొనడానికి సంబంధిత విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇది ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ పేలుడు తర్వాత బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పేలుడు సందర్భంగా స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పేలుడు కారణాలకు ఓ మహిళ అని తెలుస్తోంది. మహిళ తనను తాను బాంబుతో ఆత్మాహుతిదాడికి పాల్పడినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.అయితే అధికారులు పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు.