Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అనాగరిక పాలన.. గే సెక్స్, వ్యభిచారం చేసినందుకు కొరడా దెబ్బలు

తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌లో అనాగరిక పద్ధతులు పాటిస్తున్నారు. గే సెక్స్, వ్యభిచారం వంటి పనులు చేసినందుకుగాను 12 మందిని శిక్షించారు. బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టారు.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అనాగరిక పాలన.. గే సెక్స్, వ్యభిచారం చేసినందుకు కొరడా దెబ్బలు

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అనాగరిక పాలన కొనసాగుతోంది. ప్రపంచ పోకడలతో సంబంధం లేకుండా తమకు నచ్చినట్లుగా పాలన చేస్తున్నారు. ముఖ్యంగా నైతికత పేరుతో ప్రజలకు దారుణమైన శిక్షలు విధిస్తున్నారు.

PSLV C-54: పీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం సక్సెస్.. తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్

ఇటీవల 12 మందికి నైతిక విలువలు ఉల్లంఘించినందుకు కొరడా శిక్షలు విధించారు. లోగార్ ప్రాంతంలోని ఒక స్టేడియంలో జనం చూస్తుండగా 12 మందిని కొరడాతో దారుణంగా కొట్టారు. వ్యభిచారానికి పాల్పడ్డందుకు, గే సెక్స్, దొంగతనం వంటి నేరాలకుగాను తాలిబన్లు ఈ శిక్ష విధించారు. ఒక్కొక్కరిని 21-39 వరకు కొరడా దెబ్బలు కొట్టారు. షరియా చట్టం ప్రకారం ఈ శిక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 మందిలో కొందరిని కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత వదిలిపెట్టగా, ఇంకొందరిని జైలుకు తరలించారు. ఈ పన్నెండు మందిలో పురుషులు, స్త్రీలు ఉన్నారు. తాలిబన్ల పాలనపై అక్కడి ప్రజలతోపాటు, ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఆగష్టులో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ల పాలనే సాగుతోంది.

Reservation For Home Guards : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ అరాచక పాలన సాగుతోంది. ముఖ్యంగా సంప్రదాయాల పేరుతో మహిళలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. ఆడ పిల్లల చదువులపై ఆంక్షలు పెట్టారు. అలాగే మహిళల్ని, ఆడ పిల్లల్ని అమ్యూజ్‌మెంట్ పార్కులు, జిమ్‌లలోకి వెళ్లడాన్ని నిషేధించారు. కాగా, గతేడాది అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్లు మహిళల హక్కులకు విలువనిస్తామని, కొత్త తరం పాలన అందిస్తామని చెప్పారు. అయితే, ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.