PSLV C-54: పీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం సక్సెస్.. తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

PSLV C-54: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 11.56 గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దాదాపు 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ ముగియగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
PSLV-C54/EOS-06 Mission: EOS-06 spacecraft separation is successful. The spacecraft's health is normal. The mission is continuing …
— ISRO (@isro) November 26, 2022
పీఎస్ఎల్వీ -సీ54 తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. ఈవోఎస్ 06 (ఓషన్ శాట్ 03) అనే ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపింది. ఇందులో మూడు దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, ఇండియా – భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో నాలుగు శాటిలైట్లను ఇస్రో పీఎస్ఎల్వీ -సీ54 నింగిలోకి మోసుకెళ్లింది.
Also Read- PSLV-C54 Launch: నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ54.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూ వాతావరణం పరిశీలన, తుఫానులను పసిట్టడం, వాతావరణంలో తేమ, అంచనా, సముద్రాల మీద వాతావరణం అధ్యయనం చేయనున్నారు. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం.. మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ప్రయోగం విజయవంతం కావటం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.