Afghan Taliban : తాలిబన్ల తీరు మారలేదు..ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా..దారుణాలు ఆపలేదు : ఐరాస కార్యదర్శి ఆవేదన

తాలిబన్ల తీరు మారలేదు..ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా..వారి దారుణాలు ఆపలేదని సాక్షాత్తు ఐరాస కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మారిపోయామని తాలిబన్లు చెప్పే మాటలు నిజం కావదన్నారు.

Afghan Taliban : తాలిబన్ల తీరు మారలేదు..ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా..దారుణాలు ఆపలేదు : ఐరాస కార్యదర్శి ఆవేదన

Taliban Killed Dozens Of Former Ex Afghan Officials (1)

Taliban killed dozens of former Ex-Afghan officials : మేం మారిపోయామని చెబుతున్న తాలిబన్లు ఏమాత్రం మారలేదని..వారు చేసే దారుణాలు ఆపలేదని మహిళలపై వేధింపులు, సాధింపులు, నిర్భంధాలతో పాటు తాలిబన్ల తీరు కూడా మారలేదని హత్యలు అఘాయిత్యాలు కొనసాగిస్తునే ఉన్నారని ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అలా వారి దారుణాల్లో భాగంగా దాదాపు 100మందికి పైగా స్వదేశీలయుల్ని హత్యలు చేశారని తాలిబన్లు అత్యంత దారుణంగా హతమార్చినవారిలో మూడింట రెండొందలమందిని ఎటువంటి విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారని తెలిపారు ఆంటోనియో గుట్టెరస్.

తాలిబన్లు 2021 ఆగస్టులో అఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకుని..పలు అరాచకాలకు తెరతీసారు. తీవ్ర విధ్వంసం సృష్టించారు. మహిళలపై దారుణమైన నిర్బంధాలు, ఆంక్షలు విధించారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా వేధించారు. దీంతో వారి అరాచక పాలనకు గురి కాకుండా దేశం వదిలిపోయారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు చాలామంది దేశం వదలిపోయారు. ఆడవారు ఆటలు ఆడకూడదని..ఉద్యోగాలు చేయకూడదంటూ ఆంక్షలు విధించారు.

Also read : Afghan Crisis :తమను జైళ్లకు పంపిన మహిళా జడ్జిల కోసం గాలిస్తున్న తాలిబన్లు..ప్రాణభయంతో దాక్కున్న వందలమంది న్యాయమూర్తులు

గతంలో తాలిబన్లు చేసిన అరాచకాలపై విచారణ చేసి శిక్షలు విధించిన మహిళా జడ్జీల కోసం వేటకుక్కల్లా గాలించారు. దీంతో వందలాదిమంది మహిళా జడ్జీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడకున్నారు. ఇలా తాలిబన్లు చేసే అరాచకాలకు అంతులేకుండా పోయింది. దీంతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతరేకిత వచ్చింది. తీవ్ర సంక్షోభంలో అప్ఘాన్ చిక్కుకుపోయేలా చేసిన తాలిబన్లు విదేశాల నుంచి వచ్చే సహాయ సహకారాలు నిలిచిపోవటానికి కారణమయ్యారు.

Also read :  Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

దీంతో విదేశీ సహకారాలు నిధులు నిలిచిపోయేసరికి తాలిబన్లు తాము మారిపోయాం అంటూ కొత్తపాట అందుకున్నారు. కానీ అంతర్జాతీయంగా తాలిబన్లను నమ్మే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో తాము నిజంగా మారిపోయామని ప్రజారంజకంగా పాలన చేస్తామంటూ అంతర్జాతీయంగా నమ్మించటానికి యత్నించారు తాలిబన్లు. విదేశీ బ్యాంకుల్లో నిల్వలను వాడుకోవటానికి మారిపోయాం అంటూ నమ్మించే యత్నాలు చేశారు. కానీ వారు నిజంగా మారారా? అంటే మారలేదని చెబుతున్నారు ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌.

Also read : Afghanistan : మరో దారుణం.. జానపద గాయకుడిని హత్యచేసిన తాలిబన్లు

ఐక్యరాజ్యసమితికి అందిన సమాచారం ప్రకారం..అఫ్గాన్‌లో ప్రభుత్వ మాజీ సభ్యులు, మాజీ భద్రతా దళ సభ్యులు, అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు.. కలిపి దాదాపు 100 మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌ చెప్పారు.తమ హయాంలో దేశీయులందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని, కక్ష సాధింపులుండవని గతంలో తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాలిబన్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అఫ్గాన్‌లో హక్కుల కార్యకర్తలు, మీడియాపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని గుట్టెరస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అటు తాలిబన్లు, ఇటు ఐఎస్‌ ఉగ్రవాదులు కలిపి ఇప్పటికి 8 మంది పౌర హక్కుల కార్యకర్తలను చంపారని, 10 మందిని నిర్బంధించారని తెలిసిందన్నారు.

Also read : Afghan Crisis : వాలీబాల్ క్రీడాకారిణి తల నరికేసిన తాలిబన్లు

త్వరలో ఎన్నికలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. కానీ పాలన చేజిక్కించుకున్న తరువాత ఎన్నికలు అనే మాటే ఎత్తటంలేదు. మహిళల విషయంలో తాము మారిపోయామని పైకి మెరమెచ్చపు మాటలు చెప్పే తాలిబన్లు మహిళలపై తీవ్ర నిర్భంధం కొనసాగిస్తునే ఉన్నారని..అప్ఘాన్ దేశంలో మానవహక్కుల పరిరక్షణ జరపకపోతే విదేశీ సాయం అందించమని పలు దేశాలు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని, దాదాపు 3 కోట్లమంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని ఆంటోనియో చెప్పారు. మరోవైపు తాలిబన్లపై ఎన్‌ఆర్‌ఎఫ్, ఐసిస్‌ దాడులు కూడా పెరిగాయన్నారు. తాలిబన్లలో జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని సాక్ష్యాత్తు ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌ చెబుతుంటే ఇక తాలిబన్లు మారాయని చెప్పుకోవటం హాస్యాస్పదమే అవుతుంది.