Mali Terror Attack: బస్సుపై కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఉగ్రవాదులు..32 మంది ప్రయాణికులు సజీవదహనం

మాలిలో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.ఈ ఘటనలో 32 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

Mali Terror Attack: బస్సుపై కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఉగ్రవాదులు..32 మంది ప్రయాణికులు సజీవదహనం

Mali Terror Attack..32 Of Civilians Killed

Mali Terror Attack..32 of civilians killed: మాలి దేశంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బస్సుపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఓ బస్సుపై కాల్పులు చేసి బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో 32 మంది ప్రయాణికులు చనిపోయారు. బస్సులో మార్కెట్ కు వెళుతున్న ప్రయాణీకులపై బండియాగ్రా సమీపంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కాల్పులు జరిపారు. ఈ దాడిలో 32మంది ప్రయాణీకులు మృతి చెందారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బండియాగ్రాలోని ఓ మార్కెట్‌కు సోంగో గ్రామ ప్రజలు బస్సులో బయలుదేరి వెళ్తున్నారు. ఆ బస్సు వారంలో రెండు రోజులు మాత్రమే మార్కెట్ కు వెళ్తుంది. అలా మార్కెట్ కు వెళ్లి నిత్యావసర వస్తువువలతో పాటు అవసరమైన సరుకులు తెచ్చుకుంటుంటారు ప్రజలు. ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్ 3,2021) బస్సు సోంగో గ్రామం నుండి 10 కి.మీటర్ల దూరంలో ఉన్న బండియాగరాలోని మార్కెట్‌కి వెళుతున్న సమయంలో ఉగ్రవాదులు అటకాయించారు. బస్సుని ఉగ్రవాదులు టార్గెట్‌ చేసి కాల్పలు జరిపారు.

Read more : మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

రోడ్డుపై బస్సును నిలిపివేసి..ముందుగా బస్సు డ్రైవర్‌ను కాల్చి చంపారు. ఆ తరువాత బస్సు టైర్లలో గాలి తీశారు. ఆ తర్వాత ప్రయాణికులపై ఉగ్రవాదులు తుపాలతో ఇష్టానుసారంగా కాల్పులు జరిపారు. అక్కడితో వారి పైశాచికత్వం ఆగలేదు. తుపాకి బుల్లెట్లు తగిలినా వారు బతుకుతారని అనుకున్నారో ఏమోగానీ..పెట్రోల్‌ పోసి బస్సును తగులబెట్టి.. అక్కడి నుండి వెళ్లిపోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారని తెలుస్తోంది.

ఉగ్రదాడుల చేసిన ఈ మారణ హోమంలో 32 మంది ప్రజలు సజీవంగా దహనమైపోయారు. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బస్సు కాలిపోగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి అక్కడ భయంకరమైన వాతావరణం నెలకొంది. గత కొన్ని నెలలుగా మాలి దేశంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి.

అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. నార్త్‌ మాలిలో ఉగ్రదాడులు ఆగడం లేదు. ఇటీవల యూఎన్‌ కాన్వాయ్‌పై దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరోకరు గాయపడ్డారు. మాలి దేశంలో ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాట్లతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. 2021 మే నెలలోనే మాలిలో కొత్త గవర్నమెంట్‌ ఏర్పాటైంది. మాలిలో జిహాదీల తిరుగుబాటుతో ఈ ఘోరమైన దాడి మరొక ఘటనగా మారింది.