Corona Virus : కరోనాతో చనిపోయిన తర్వాత మృతదేహంలో వైరస్‌..!

ఉక్రెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలో స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతూ చనిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు.

Corona Virus : కరోనాతో చనిపోయిన తర్వాత మృతదేహంలో వైరస్‌..!

Corona (5)

corona dead body  : కరోనాతో చనిపోయిన తర్వాత మృతదేహంలో వైరస్ ఉంటుందా అని అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో ఉండదని చెప్పినప్పటికీ తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. కరోనాతో చనిపోయిన వారి డెడ్‌బాడీలో వైరస్ ఇంకా ఉంటుందని తెలిపింది. ఇటలీలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి పరీక్షలు చేయగా ఈ విషయం వెల్లడైంది. ఒక డెడ్ బాడీకి 41 రోజుల్లో 28సార్లు కొవిడ్‌ పరీక్షలు చేయగా.. ప్రతిసారీ పాజిటివ్‌గానే వచ్చింది.

ఉక్రెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలో స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతూ చనిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శవపరీక్షకు ముందు మృతదేహానికి కరోనా ఆర్టీపీసీఆర్​పరీక్ష చేశారు. ఆ సమయంలో పాజిటివ్‌ అని వచ్చింది.

Covid-19 In India :కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న భారత్..2శాతానికి పడిపోయిన పాజిటివిటీ

అయితే అంత్యక్రియల నిర్వహణకు అనుమతులు రాకపోవడంతో.. 4 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాల్సి వచ్చింది. ఆ సమయంలోనే డి అన్నున్​జియో విశ్వవిద్యాలయ వైద్యులు..ఆ డెడ్‌బాడీకి కరోనా పరీక్షలు చేశారు. 41 రోజుల్లో 28సార్లు శాంపిళ్లు తీసి పరీక్షించగా.. ప్రతిసారీ పాజిటివ్‌గానే ఫలితం వచ్చింది.

గతంలో జర్మన్ పరిశోధకులు ఇదే విషయంపై అధ్యయనం చేయగా.. పోస్ట్‌మార్టం తర్వాత 35 గంటల వరకు వైరస్ శరీరంలో వృద్ధి చెందుతున్నట్లు తేలింది. కానీ తాజా ఫలితాల కారణంగా ఈ అంశంపై మరిన్ని విస్తృత ప్రయోగాలు జరగాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.