Covid-19 In India :కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న భారత్..2శాతానికి పడిపోయిన పాజిటివిటీ

కరోనా నుంచి భారత్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు కేవలం 2శాతం మాత్రమే నమోదు అయ్యింది. దీంతో భారత్ లో కోవిడ్ కనుమురుగు అయినట్లుగా భావిస్తున్నారు.

Covid-19 In India :కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న భారత్..2శాతానికి పడిపోయిన పాజిటివిటీ

Covid 19 In India

Covid become pandemic : దాదాపు రెండున్నరేళ్లుగా కోవిడ్ తో సతమతమవుతున్న భారత్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.దీంతో కోవిడ్ పీడ దాదాపు వదిలిపోయినట్లుగానే నిపుణులు సైతం భావిస్తున్నారు. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో 27,409 కేసులు మాత్రమే నమోదు కావటం..పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. కేవలం రెండు శాతం మాత్రమే పాజిటివిటీ రేటు నమోదు అయ్యింది. ఫిబ్రవరి నెలలో కోవిడ్ థర్డ్ వేవ్ పీక్స్ స్టేజీకి వెళుతుందన్న అంచనాలు తారుమారు అయ్యాయి. గత జనవరి 22 నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టటమే దీనికి నిదర్శం. కాగా కోవిడ్ నియంత్రణంలో భాగంగా దాదాపు ఏడాది నుంచి దేశ ప్రజలకు కోవిడ్ టీకాలు అందజేస్తున్నారు. దీంట్లో బాగంగా దేశ వ్యాప్తంగా 173.42 కోట్ల కోవిడ్ టీకాలు అందజేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కోవిడ్ కథ ముగిసింది అని లాన్సెట్ మెడికల్ జర్నల్ కూడా వెల్లడించింది. కానీ ఇది పూర్తిగా అంతమైపోయినట్లు కాదని తెలిపింది. కానీ ఇది ఎప్పటికీ మనతోనే ఉంటుందని కూడా సూచించింది. కోవిడ్ కథ ముగిసింది అంటే మాస్కులు తీసివేయటం కాదని సూచించింది. కోవిడ్ మనతోనే ఎప్పటికీ ఉంటుందని..సీజనల్ ఫ్లూ మాదిరిగా కొనసాగుతుందని అంచనా వేసింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కోవిడ్ మహమ్మారి ఎండెమిక్ మారిందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన పత్రికా సంపాదకీయాన్ని ప్రచురించింది. వైద్య రంగానికి సంబంధించి లాన్సెట్ ను విశ్వసనీయమైన పత్రికగా చెబుతారు విశ్లేషకులు సైతం.

కరోనా ఎండెమిక్ గా మారినట్టు లాన్సెట్ సంపాదకీయం ద్వారా వెల్లడించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..‘‘ఎండెమిక్ అంటే స్థానికంగా ఉండే అంటు వ్యాధి’’ అని అర్థం. దీంతో కరోనా ఒక మహమ్మారిగా విరుచుకుపడే శక్తిని కోల్పోయినట్టు. కానీ అతి తక్కువ స్థాయిలో అనారోగ్యానికి గురి చేసే శక్తి మాత్రమే ఉంటుందని అర్థం చేసుకోవాలి. కరోనా ఎండెమిక్ అయినప్పటికీ..ఈ మహమ్మారి ఎప్పటికీ మనతోనే ఉంటుందని లాన్సెట్ తెలిపింది. సీజనల్ ఫ్లూ (రుతువులు మారిన సందర్భాల్లో వచ్చే జలుబు)గా కొనసాగుతుందని లాన్సెట్ అభిప్రాయపడింది.

ఎక్కువ మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడినట్టు లాన్సెట్ అంచనా వేసింది. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తు చేసింది. ఏటా ఎంతో మంది మరణాలకు కారణమవుతున్న ఇతర సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులపైనా పరిశోధన చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.