ఈ రింగ్ చాలా హాట్ గురూ

ఈ రింగ్ చాలా హాట్ గురూ

Thermoelectric ring : ఈ రింగ్ చాలా హాట్ గురూ..అంటే అబ్బో ఎంత ఖరీదో అని తప్పులో కాలేయకండి. ఫొటోలో ఉన్న ఉంగారాన్ని చూసి..అంత ఏముంది అందులో ? అని ఏదో కొట్టిపారేయకండి. ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో (University of Colorado (UC)) శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. ఇందులో ఏమిటా స్పెషాల్టీ అంటే..శరీర ఉష్ణోగ్రతను విద్యుత్ గా మార్చేయడమే హైలెట్. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ (TEG) లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పరిసరాల్లో ఉష్ణోగ్రతకు, శరీరంలోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఉంగరం.

పాలీమైన్ అనే ప్రత్యేకమైన పదార్థంతో ఈ ఉంగారాన్ని తయారు చేశారు. పై భాగంలో చిన్న సైజు TEGలు ఉంటాయి. చర్మం ఎంత మేరకు ఈ పాలీమైన్ పదార్థానికి అతుక్కుని ఉందో..అంత విద్యుత్ తయారు చేయగలదు. ప్రతి చదరపు సెంటీమీటర్ కు ఒక వోల్టు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. చేతికి తొడుక్కొనే కడియం లాంటిది తయారు చేస్తే..విద్యుత్ ఉత్పత్తి 5 వోల్టుల వరకు పెంచొచ్చని చెబుతున్నారు. వాచ్ లు, ఫిట్ నెస్ ట్రాక్టర్లకు ఈ కరెంటు సరిపోతుందంటున్నారు.