కరోనా వేళ..పిల్లికి సెక్యూర్టీ జాబ్

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 09:23 AM IST
కరోనా వేళ..పిల్లికి సెక్యూర్టీ జాబ్

కరోనా వేళ ఉద్యోగాలు పోయి..బిక్కుబిక్కుమంటుంటే..ఓ పిల్లి మాత్రం ఉద్యోగంలో చేరింది. మెడలో ఐడీ కార్డుతో ఫోజులిస్తున్న ఈ పిల్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Epworth ఆసుపత్రి బయట పిల్లి సెక్యూర్టీగా విధులు నిర్వహిస్తోంది. పిల్లి మెడలో ఓ ఐడీ కార్డు కూడా ఉంది.



అందులో పిల్లి పేరు…ఎల్వుడ్ గా నమోదు చేశారు. సంవత్సరం నుంచి పిల్లి ఆసుపత్రి బయటే అటూ..ఇటూ తిరుగుడడంతో సెక్యూర్టీగా పెట్టుకుంది సదరు ఆసుపత్రి యాజమాన్యం. అధికారికంగా దానికి సెక్యుర్టీ జాబ్ ఇచ్చారు.
https://10tv.in/ap-political-war-social-media-war-between-old-friends/
గేటు వద్ద ఉండడంతో పాటు..హాస్పిటల్ చుట్టూ రౌండ్లు వేస్తోంది. ఈ పిల్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.