US : అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ ఘర్జించింది. మరో ముగ్గురి ప్రాణాలు తీసింది. తుపాకీ తూటాలకు ప్రాణాలు బలికావటం అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయిన క్రమంలో మరోసారి తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. మిచిగన్ రాష్ట్రాలోని యూనివర్సిటీలో ఓ వ్యక్తి కాల్పులు జరపటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

US : అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

shooting at Michigan State university

shooting at Michigan State university : అమెరికాలో మరోసారి తుపాకీ ఘర్జించింది. మరో ముగ్గురి ప్రాణాలు తీసింది. తుపాకీ తూటాలకు ప్రాణాలు బలికావటం అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయిన క్రమంలో సోమవారం (ఫిబ్రవరి,2023) మరోసారి తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. మిచిగన్ రాష్ట్రాలోని యూనివర్సిటీలో సోమవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్సిటీలోని బర్కీ హాల్, యూనియన్ బిల్డింగ్‌లో నిందితుడు కాల్పులు జరపరగా ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

వర్శిటీలో కాల్పులు జరిగాయనే సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. యూనియన్ భవనం నుంచి ఓ వ్యక్తి నడుస్తూ వెళ్లినట్లుగా చూశామని కొంతమంది పోలీసులకు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి వర్శిటీలోని భవనాలను స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు దుండగుడు ఆ చుట్టుపక్కలే దాక్కుడనే అనుమానంతో భవనాలను..ఆ చుట్టుపక్కల ప్రాంతాలను గాలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి మాస్క్ పెట్టుకున్నాడని యూనివర్సిటీ పోలీసు అధికారి రాజ్‌మన్ తెలిపారు.

క్యాంపస్ మొత్తాన్ని జల్లెడపడుతున్నారు.గాలింపు చర్యలకు ఆటంకం కలుగకుండా వర్శిటీలో 48 గంటల పాటు క్లాసులు, ఇతర క్యాంపస్ కార్యకలాపాలను నిలిపివేశారు. కాగా అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఇక్కడి ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో సుమారు 50 వేల మంది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువుకుంటున్నారు.