దరిద్రం పట్టిస్తున్నావ్ : TikTokకు రూ.40కోట్ల జరిమానా 

  • Published By: vamsi ,Published On : February 28, 2019 / 04:42 AM IST
దరిద్రం పట్టిస్తున్నావ్ : TikTokకు రూ.40కోట్ల జరిమానా 

వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారు వరకు టిక్ టాక్ వీడియోలు చేసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ ఒక్కరిలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చైనా సోషల్‌ మీడియా యాప్‌ కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ ‍కమిషన్(FTC)‌ 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్‌లోడ్‌ చేసి తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉండడంతో ఈ యాప్ పై ప్రతీ ఒక్కరికీ క్రేజ్ ఉంది.
Read Also : లాహోర్‌లో ఇండియన్ ప్యాసింజర్స్ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచడం ద్వారా టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఎఫ్‌టీసీ. ‘అమెరికాలో దాదాపు 65 మిలియన్ల మంది టిక్‌టాక్‌ యూజర్లు ఉన్నారు. musical.lyతో ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ను చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వినియోగిస్తుండగా పదమూడేళ్ల లోపు చిన్నారుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవుతున్నాయి.ఇది అమెరికా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. చిన్నారుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టిక్‌టాక్‌ వంటి మరెన్నో సోషల్‌ మీడియా యాప్‌లకు, సైట్‌లకు ఈ జరిమానా కనువిప్పు కలిగిస్తుందని భావిస్తున్నట్లు ఎఫ్‌టీసీ చైర్మన్‌ జో సైమన్స్‌ వెళ్లడించారు.
Read Also : గుంటూరు టికెట్ డిమాండ్ : జగన్ తో ఎన్టీఆర్ మామ నార్నే మళ్లీ భేటీ

ఎఫ్‌టీసీ తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించింది. అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ యాప్‌ పని చేస్తోందని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని వెల్లడించారు. 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్‌ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. టిక్ టాక్ యాజమాన్యం సమాధానంతో సంతృప్తి చెందలేదు అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్. పిల్లలకు భద్రత లేకుండా చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానా విధించింది. ఫైన్ కట్టాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చింది కమిషన్.