Donald Trump : కోవిడ్ బూస్ట‌ర్ డోసు తీసుకున్నా.. మీరూ తీసుకోండి.. ట్రంప్ విజ్ఞప్తి

డోనాల్డ్ ట్రంప్‌ కోవిడ్ బూస్ట‌ర్ డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ క్రెడిట్‌ను మ‌న‌మే తీసుకోవాల‌న్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది ప్రాణాలు దక్కాయని ట్రంప్ చెప్పారు.

Donald Trump : కోవిడ్ బూస్ట‌ర్ డోసు తీసుకున్నా.. మీరూ తీసుకోండి.. ట్రంప్ విజ్ఞప్తి

Trump Reveals He Got Covid 19 Booster Shot; Crowd Boos Him

Donald Trump : అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కోవిడ్ బూస్ట‌ర్ (Covid-19 Booster) డోసు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. టెక్సాస్ ప‌ర్య‌టిస్తున్న సమయంలో ట్రంప్‌ను ఫాక్స్ న్యూస్‌ మాజీ ప్రజెంట‌ర్ ఒకరు ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా వ్యాక్సిన్ల గురించి ట్రంప్ ప్రస్తావించారు. వ్యాక్సిన్ల వ‌ల్లే కోట్లాది మంది ప్రాణాల‌ను కాపాడుకోగలిగారని చెప్పారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. మీరు బూస్ట‌ర్ తీసుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. అవును, నేను బూస్టర్ షాట్ తీసుకున్నాన‌ని ట్రంప్ వెల్లడించారు.

వ్యాక్సిన్ క్రెడిట్‌ను మ‌న‌మే తీసుకోవాల‌న్నారు. మీరు టీకా వ‌ద్దు అనుకుంటే.. తీసుకోకండి. కానీ వ్యాక్సిన్లు తీసుకోవడం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది ప్రాణాలు దక్కాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పుడా వేరియంట్ మరింత తీవ్రంగా మారింది.

అమెరికాలో 73 శాతం కరోనా కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగానే న‌మోదు అవుతున్నాయి. తన మ‌ద్ద‌తుదారులంతా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ట్రంప్ కోరారు. వ్యాక్సిన్ల‌ను రూపొందించి హిస్టరీ క్రియేట్ చేశామన్నారు. అమెరికాలో మూడు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఆ క్రెడిట్ ద‌క్కేలా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్దనని త‌న సపోర్టర్లను ట్రంప్ కోరారు.

Read Also : High Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలు