సిరియా బోర్డర్ లో టెన్షన్…యుద్ధ విమానాలతో డ్రోన్ ని కూల్చేసిన టర్కీ

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2019 / 02:44 AM IST
సిరియా బోర్డర్ లో టెన్షన్…యుద్ధ విమానాలతో డ్రోన్ ని కూల్చేసిన టర్కీ

సిరియా బోర్డర్ లో టర్కీ వైమానిక ప్రాంతాన్ని ఆరుసార్లు ఉల్లంఘించిన గుర్తు తెలియని డ్రోన్‌ను టర్కీ సైన్యం ఆదివారం కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్‌ను గుర్తించి దానిపై దాడి చేసి కూల్చి వేసిందని,అయితే డ్రోన్ ఏ దేశానికి చెందినదో వెంటనే నిర్ణయించలేమని మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపింది.

టర్కీ గగనతలంలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడిన డ్రోన్ ను రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్‌ను గుర్తించాయి, అయితే డ్రోన్ ఏ దేశానికి చెందినదో వెంటనే నిర్ణయించలేమని మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ యూఫ్రటీస్ షీల్డ్, కిలిస్ దక్షిణ ప్రావిన్స్ కిలిస్ ఆపరేషన్ సెంటర్లో ఈ ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. కిలిస్ లో సైనిక స్థావరం,శరణార్థుల తాత్కాలిక ఆశ్రయ కేంద్రం మధ్య డ్రోన్ ను కూల్చివేయబడినట్లు తెలిపారు.